Guntur Kaaram Box Office Collection: సూపర్‌స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం కలెక్షన్లు రెండోరోజు కంటే ఆదివారం స్వల్పంగా పెరిగాయి. జనవరి 12న రిలీజైన ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.41.03 కోట్లు వసూల్ చేసింది. ఇక ఫస్ట్ షో తర్వాత వచ్చిన మిక్స్డ్ టాక్ కలెక్షన్లపై ప్రభావం చూపింది. దీంతో రెండోరోజు వసూళ్లు పడిపోయాయి. రూ.13.55 కోట్లు వసూల్ చేసిన ఈ మూవీ, ఆదివారం రూ.14.25 కోట్లు నెట్ సాధించింది. దీంతో గుంటూరు కారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.69.10 కోట్ల నెట్ వసూల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా రోజువారి నెట్ కలెక్షన్లు
- తొలి రోజు- రూ.41.03 కోట్లు
- రెండో రోజు- రూ.13.55 కోట్లు
- మూడో రోజు- రూ.14.25 కోట్లు
Guntur Kaaram Occupancy Day 3: అదివారం గుంటూరు కారం ఓవరాల్ ఆక్యుపెన్సీ 45.19 శాతంగా నమోదైంది. అందులో మార్నింగ్ షో 26.30 శాతం, మ్యాట్నీ షో 50.11 శాతం, ఈవినింగ్ షో 57.80 శాతం, నైట్ షో 46.55 శాతం నమోదైంది.
Worldwide Box Office Gross: మూడు రోజుల్లో ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.164 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ (Haarika And Hassine Creations) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఈ లెక్కన తొలిరోజు రూ.94 కోట్లు, శనివారం రూ.33 కోట్లు, ఆదివారం రూ.37 కోట్ల గ్రాస్ వసూలైంది. అటు ఓవర్సీస్లోనూ డీసెంట్ బుకింగ్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. మూడో రోజుల్లోనే ఓవర్సీస్లో 2+ మిలియన్ డాలర్లు వసూలైనట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
Guntur Kaaram Cast:ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటులు రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం ఆయా పాత్రల్లో నటించారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిచగా, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఎస్, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మించారు.
'గుంటూరు కారం' వసూళ్లు డౌన్! - రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'గుంటూరు కారం' మిక్స్డ్ రివ్యూ - రియాక్ట్ అయిన దిల్ రాజు, నాగవంశీ