టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో గుణశేఖర్ఒకరు. ఈయన చేసిన సినిమాలుతక్కువే అయినా అందులో చాలా వరకు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమాలు చేసేందుకు గుణశేఖర్ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'చూడాలని ఉంది'. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో చిరు-అంజల ఝవేరిల మధ్య వచ్చే రైల్వేస్టేషన్ లవ్ సీన్ అప్పట్లో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఎంతో స్పెషల్‌గా నిలిచింది. చిరు, అంజలిల మధ్య డైలాగ్స్ లేకుండానే కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో నడిచేలా ఆ సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు గుణశేఖర్. అయితే తాజాగా 'శాకుంతలం' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఆ సీన్ వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
"చూడాలని ఉంది సినిమాలో.. రైల్వే స్టేషన్లో చిత్రీకరించిన ఆ ప్రేమ సన్నివేశం దాదాపు పది నిమిషాల పాటు కొనసాగుతుంది. చిరంజీవికి ఆ సీన్లో అసలు డైలాగ్‌లు ఉండవు. ఆయన ఆ రైల్వేస్టేషన్లో చైర్ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. మెగాస్టార్‌కు డైలాగ్ లేకుండా ఒక నిమిషం పాటు సీన్‌ను కొనసాగించడం మామూలు విషయం కాదు. అలాంటిది అంత సేపు చిత్రీకరించాం. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని నేను అడిగాను. దీంతో నిర్మాత అశ్వనిదత్ షాక్ అయిపోయారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్ చాలా పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు చేస్తుంటాయి. అందులోనూ మూడు రోజుల పాటు చిరంజీవిని పెట్టి చిత్రీకరించడమంటే చాలా కష్టమైన విషయం. పైగా ఆయనతో షూటింగ్ చేస్తున్నాం అంటే రైల్వేశాఖ అనుమతి కూడా ఇవ్వదు. ఎందుకంటే అక్కడ షూటింగ్ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. రైళ్లు నిలిచిపోతాయి. టైమింగ్స్ మారిపోతాయి. చివరికి అతి కష్టమ్మీద అనుమతి దక్కింది. అసలు ఆ సినిమా షూటింగ్ అప్పుడు చాలా మంది రైళ్లు ఎక్కకుండానే స్టేషన్లో ఉండిపోయారు" అని గుణశేఖర్ తెలిపారు.