Guess This South Famous Actor in This Photo : సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత.. సినీ స్టార్లకు, అభిమానులకు మధ్య ఉన్న దూరం చాలా తగ్గింది. వారితో నేరుగా చాట్ చేసే అవకాశం కూడా వస్తోంది. ఈ క్రమంలోనే.. వారి చిన్ననాటి విషయాలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. వైరల్ అయిపోతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిది. ఇందులో కనిపిస్తున్న క్యూట్ బాయ్.. ఇప్పుడు సౌత్‌లో సూపర్ స్టార్. ఆయన మరెవరో కాదు.. తమిళ్ "సింగం" సూర్య!
అవును.. ఈ చైల్డ్ హుడ్ ఫొటో.. తమిళ్ స్టార్ హీరో సూర్య(Hero Suriya)దే. ఈ టాప్ స్టార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న ఈ కోలీవుడ్ స్టార్.. వెర్సటైల్ యాక్టర్‌గా అటు క్లాస్‌నీ ఇటు మాస్‌నీ ఉర్రూతలూగించగలడు. ఈ సౌత్ స్టార్ రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఆరు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆరుసార్లు చోటు సంపాదించారు. ఇక ఈ స్టార్ హీరో వ్యక్తిగత విషయాలను ఓసారి చూస్తే..
Actor Suriya Unseen Childhood Photo : హీరో సూర్య తమిళ సినీ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు జులై 23, 1975న మద్రాస్‌లో జన్మించారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి శివకుమార్ క్యారెక్టర్ ఆర్టిస్టు. కానీ.. అవకాశాలు అంతగా వచ్చేవి కావు. దాంతో పెద్ద కొడుకుగా ఇంటి భారం మోయాలని నిర్ణయించుకున్న సూర్య.. ఉద్యోగం సంపాదించుకునే పనిలో పడ్డాడు. అయితే.. ఎక్కడా తాను ఫలాన నటుడి కొడుకునని చెప్పుకోలేదు. అలా రెండు నెలల ప్రయత్నం తర్వాత.. ఓ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత.. అనుకోని పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.