తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అవకాశం వస్తే ఆ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రాశీఖన్నా - గోపిచంద్​ పక్కాకమర్షియల్​

Pakka commercial Rasikhanna: ఇప్పటివరకు తాను పోషించిన పాత్రలన్నింటిలోకెల్లా 'పక్కా కమర్షియల్‌'లో చేసిన ఝాన్సీ పాత్ర ది బెస్ట్ అని అన్నారు నటి రాశీఖన్నా. ఈ రోల్​ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు. ఇంకా తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన పాత్రలు, ఇష్టాయిష్టాలు పంచుకున్నారు.

rasikhanna pakka commercial
రాశీ ఖన్నా పక్కా కమర్షియల్​

By

Published : Jun 16, 2022, 1:37 PM IST

Pakka commercial Rasikhanna: 'ఊహలు గుసగుసలాడే'తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్​ రాశీఖన్నా.. గ్లామర్​ సహా ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా హీరో గోపిచంద్​తో కలిసి ఆయన నటించిన చిత్రం 'పక్కా కమర్షియల్'​. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాశీ.. తన కెరీర్​ సహా ఇష్టాయిష్టాలు గురించి చెప్పుకొచ్చారు.

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో రాశీ.. న్యాయవాదిగా కన్పించనున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాశీఖన్నా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

"దర్శకుడు మారుతితో ఇది నా రెండో సినిమా. ఆయన దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటించాను. అందులో నేను పోషించిన ‘ఏజెంల్‌ ఆర్నా’ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా చూసినవాళ్లు చాలా మంది ఏంజెల్‌ ఆర్నా పాత్ర ఇంకాస్త ఉండుంటే బాగుండేదనుకున్నారు. దాంతో మారుతి.. తదుపరి చిత్రంలో మంచి రోల్‌ క్రియేట్‌ చేస్తానని ఆ సమయంలో నాకు మాటిచ్చారు. అలా, 'పక్కా కమర్షియల్‌' కోసం ఆయనతో మరోసారి టీమ్‌ అప్‌ కావాల్సి వచ్చింది. ఇందులో నా రోల్‌ ఎంతో ఫన్నీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లోకెల్లా ఇదే ది బెస్ట్‌ రోల్‌. 'ఊహలు గుసగుసలాడే' నుంచి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. భవిష్యత్తులో అవకాశం వస్తే నెగటివ్‌ రోల్‌, బాహుబలి సినిమాలో అనుష్క పోషించిన దేవసేన వంటి బలమైన పాత్రల్లో చేయాలనుకుంటున్నా" అని రాశీ తెలిపారు. కాగా, పక్కాకమర్షియల్​లో సత్యరాజ్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇదీ చూడండి: స్విమ్మింగ్​ పూల్​లో శ్రీముఖి.. తడి అందాలతో కవ్విస్తూ...

ABOUT THE AUTHOR

...view details