తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ విషయంలో అస్సలు రాజీ పడను: గోపీచంద్‌ - గోపిచంద్​ మారుతీ సినిమా

Gopichand Pakka commercial movie: ఆయన విలన్‌ పాత్ర పోషించిన సినిమా విజయం అందుకోవాల్సిందే. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురవాల్సిందే. యాక్షన్‌కు ఆయన రారాజు. అదొక్కటే ఆయన లక్ష్యం కాదు. యాక్షన్‌తోపాటు కామెడీని పండించి ప్రేక్షకులతో సీటీమార్‌ కొట్టించారు. రణం, లౌక్యం లాంటి పూర్తిస్థాయి యాక్షన్‌- ఎంటర్‌టైనర్‌ తర్వాత 'పక్కా కమర్షియల్‌'తో మరికొన్ని రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. ఆ స్టార్‌ ఎవరో కాదు గోపీచంద్‌. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జులై 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ విశేషాలివీ..

gopichand pakka commercial
గోపిచంద్ పక్కా కమర్షియల్​

By

Published : Jun 14, 2022, 6:32 AM IST

Gopichand Pakka commercial movie: యాక్షన్​ హీరో గోపిచంద్​ నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్​. మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. మారుతి దర్శకుడు. ఈ సందర్భంగా చిత్ర సంగతులను తెలిపారు గోపిచంద్​. ఆ సంగతులివీ..
మీ గత సినిమాలతో పోలిస్తే 'పక్కా కమర్షియల్‌'లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు?
గోపీచంద్‌: పక్కా స్టైల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. కాస్ట్యూమ్స్‌ వల్ల అంత స్టైలిష్‌గా కనిపిస్తున్నానేమో! వేషధారణలో మార్పులు వచ్చాయేమోగానీ నా ఫిట్‌నెస్‌ విషయంలో మార్పులేదు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్‌ కరమ్‌ చావ్లా నన్ను బాగా చూపించారు. నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్‌ ఆయనదే.
మారుతితో సినిమా అనగానే మీకేమనిపించింది?
గోపీచంద్‌:ఈ సినిమా ఖరారుకాక ముందు మారుతి నాకు అంతగా పరిచయం లేదు. నిర్మాత వంశీ ఓసారి నన్ను కలిసి, మారుతితో సినిమా చేద్దామనుకుంటున్నా నువ్వు చేస్తావా అని అడిగారు. మారుతి ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తీశారు.. యాక్షన్‌ కూడా కలిపితే మనకి ప్లస్‌ అవుతుంది కదా అని బదులిచ్చా. ఓకే అని చెప్పి, ఆయన కథ వినమన్నారు. కొన్ని రోజులకు మారుతి వచ్చి స్క్రిప్టు వివరించారు. అది పూర్తయ్యాక, ఈ సినిమాకి ‘పక్కా కమర్షియల్‌’ అనే టైటిల్‌ పెడుతున్నట్టు చెప్పారు. కథకు తగ్గ పేరు అని అప్పుడే ఫిక్స్‌ అయ్యా.

కథ విన్నాక మీరేమైనా సలహాలు ఇచ్చారా?
గోపీచంద్‌: ఆ అవకాశం మారుతి ఇవ్వలేదు. అంత అద్భుతంగా కథను రాసుకున్నాడు.
మీ పాత్ర గురించి వివరిస్తారా?
గోపీచంద్‌: సాధారణంగా ప్రతి ఒక్కరూ కమర్షియల్‌గానే ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులోని కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారు. నేనిందులో లాయరుగా కనిపిస్తా. ఈ క్యారెక్టర్‌ కమర్షియల్‌గానే కాదు ఎమోషనల్‌గానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
వ్యక్తిగతంగా మీరు కమర్షియలా?
గోపీచంద్‌:కమర్షియల్‌ అంటే డబ్బు అని అందరికీ తెలిసిందే. పరిస్థితులను బట్టి కొందరు డబ్బే ప్రధానంగా బతికితే మరికొందరు అవసరం మేరకు సంపాదిస్తుంటారు. నా విషయానికొస్తే.. నా పనికి తగ్గ మొత్తాన్ని ముందుగానే నిర్ణయించుకుంటా. దానికంటే ఎక్కువ తీసుకోను, తక్కువా తీసుకోను. ఈ విషయంలో నేను రాజీపడను. ఎందుకంటే నేను ఎవరికైనా సాయం చేయాలంటే ముందు నా దగ్గర మనీ ఉండాలి కదా. అది మినహా, ఇతర విషయాల్లో నేను కమర్షియల్‌ కాదు.

మారుతి సినిమాల్లో కథానాయకుడి పాత్ర ఎక్కువగా ఎలివేట్‌ అవుతుంది. ఇందులోనూ అంతేనా?
గోపీచంద్‌: అవును. కథానాయకుడి కోణంలోనే ఈ కథ నడుస్తుంది. దానికి తగ్గట్టే మారుతి సంభాషణలు రాశారు. ఆయన చాలా స్పీడ్‌. ఆయన్ను అర్థం చేసుకోవడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది.
మీ అభిమానులతో మాట్లాడుతుంటారా?
గోపీచంద్‌: నేను సోషల్‌ మీడియాలో అంత చురుకుగా ఉండను. సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు తప్ప వ్యక్తిగత విశేషాలు పంచుకోను. కానీ, మెసేజ్‌ల ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తుంటా.
మీ తొలి పాకెట్‌ మనీ ఎంత?
గోపీచంద్‌: రూ. 1, రూ. 2 (పాఠశాల రోజుల్లో). అప్పుడు అవే ఎక్కువ (నవ్వుతూ..)

మీ తొలి సంపాదన?
గోపీచంద్‌: రూ. 11,000. ‘జయం’ సినిమాకు తీసుకున్న తొలి పారితోషికమది. ఆ చిత్ర దర్శకుడు తేజ లక్కీ నంబరు 11.
మీరు ఏ సినిమాకు అత్యధిక పారితోషకం తీసుకున్నారు?
గోపీచంద్‌: పక్కా కమర్షియల్‌. విజయాన్ని బట్టి పారితోషికం పెరుగుతుంటుంది కదా.
పక్కా కమర్షియల్‌ చిత్ర బృంద సభ్యులను ఏ కరెన్సీతో పోలుస్తారు?
మారుతి: ఇండియన్‌ కరెన్సీ
రాశీఖన్నా: ఫారిన్‌ కరెన్సీ (యూఎస్‌ డాలర్స్‌)
బన్నీవాసు: పౌండ్లు
అరవింద్‌: దిర్హామ్‌
వంశీ: ఏదీ కాదు. ఎందుకంటే ఆయన డబ్బు గురించి పెద్దగా ఆలోచించరు.

ఇదీ చూడండి: 'మేజర్'​కు చిరు ఫిదా.. మహేశ్​ను ప్రశంసిస్తూ 'మెగా' ట్వీట్

ABOUT THE AUTHOR

...view details