Gopichand New Movie : ఇటీవలే 'రామబాణం'తో డిజాస్టర్‌ను అందుకున్నారు మెచో స్టార్ గోపీచంద్. అయితే ఆయన కమ్‌బ్యాక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా మెచోస్టార్కు ఏ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవ్వడం లేదు. రొటీన్ కథలతో వద్దని సినీ ప్రియులు చెబుతున్నప్పటికీ.. కమర్షియల్ జానర్‌ను వదలకుండా హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ సారి గేరు మార్చినట్టే కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Gopichand 31 Movie : నేడు(జూన్ 12) తన పుట్టినరోజు సందర్భంగా.. కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పోస్టర్లో గోపీచంద్.. పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. సీరియస్ లుక్‌లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎద్దు రంకెలు వేస్తూ దూసుకొస్తున్నట్లుగా కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Gopichand Police Character : అయితే గోపీచంద్ సిల్వర్ స్క్రీన్‌పై ఖాకీ చొక్కా తొడిగి చాలా కాలమైంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత.. మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారాయన. గతంలో 2010లో పూరీ జగన్నాథ్ 'గోలీమార్' సినిమాలో పోలీస్‌గా కనిపించారు గోపీచంద్. అందులో 'గంగారామ్' అనే పవర్ఫుల్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అంతకుముందు 'శౌర్యం', 'ఆంధ్రుడు'లోనూ పోలీస్‌గా కనిపించారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్లు కాకపోయినా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అందుకే 'భీమా' చిత్రంపై ఆడియెన్స్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఇది రూపొందనుంది. 'కేజీయఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Director Harsha Tollywood : ఇకపోతే ఈ 'భీమా' చిత్రంతో కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణ- కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కాంబో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కనిపించే అవకాశముంది.ఈయన చిత్రాలు డార్క్ టోన్‌లో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఉంటాయి. ఆయన రెండు భాగాలుగా రూపొందించిన 'భజరంగి' మంచి హిట్‌ను అందుకుంది. అలాగే 'వేద' మూవీ ఇక్కడ ఆడలేదు కానీ.. కన్నడలో మంచి హిట్‌ను అందుకుంది. మంచి కలెక్షన్లను కూడా వచ్చాయి. ఇక 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని.. కన్నడ లో రీమేక్ చేసి హిట్లు కొట్టారు. పునీత్ రాజ్ కుమార్‌తో 'అంజనీ పుత్ర' తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రకటించిన 'భీమా'పై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి హిట్‌ను అందుకుంటారో చూడాలి.