తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాజమౌళి గొప్ప దర్శకుడే.. కానీ ఆయనతో సినిమా చేయాలని లేదు: మెగాస్టార్ - గాడ్‌ ఫాదర్‌ చిరంజీవి సినిమా డైరక్టర్

Godfather Movie : దిగ్గజ సినీ దర్శకుడు రాజమౌళిపై మెగాస్టార్​ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గాడ్‌ ఫాదర్‌' సినిమా ప్రమోషన్​లో భాగంగా యాంకర్​ ప్రశ్నలకు ఈ విధంగా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..?

godfather movie
godfather movie

By

Published : Oct 1, 2022, 6:45 AM IST

Updated : Oct 1, 2022, 7:49 AM IST

Godfather Movie : ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తనకు ఇష్టమని, అయినా ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక లేదని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. 'గాడ్‌ ఫాదర్‌' ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ఛానల్‌తో ఆయన మాట్లాడారు. 'రాజమౌళితో పనిచేయనని ఇటీవల అన్నారు కదా. ఎందుకు?' అని యాంకర్‌ ప్రశ్నించగా చిరు స్పందించారు. "రాజమౌళి గొప్ప దర్శకుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలిపారు. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‌పుట్‌ను ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు".

"సినిమా తెరకెక్కించటానికి తను ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే. ఒక్కో సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారు. నేను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, పాన్‌ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని లేదు" అని చిరంజీవి నవ్వుతూ వివరించారు. తన ప్రతిభకు తన తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ కొనసాగింపు అని పేర్కొన్నారు. ఓ సినిమాకు దర్శకత్వం వహించాలనుందని తెలిపారు.

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్‌' అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకురానుంది. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి:జాన్వీ డివోషనల్​ ట్రిప్​.. శ్రీలీల న్యూ ఫొటోషూట్​!

డైరెక్టర్​ సందీప్​రాజ్ భావోద్వేగం.. రాష్ట్రపతి చేతులు మీదుగా​ జాతీయ పురస్కారం

Last Updated : Oct 1, 2022, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details