తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిరంజీవి 'గాడ్​ఫాదర్' ఫస్ట్​ డే కలెక్షన్స్​ ఎంతంటే?

Godfather First Day Collections : మెగాస్టార్​ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్​ఫాదర్'. బుధవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

Godfather First Day Collections:
Godfather First Day Collections:

By

Published : Oct 6, 2022, 11:33 AM IST

Godfather First Day Collections: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్​ఫాదర్'. విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు హిట్​టాక్ లభించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. విమర్శకుల నుంచి హిట్ రివ్యూస్ వచ్చాయి. మరి వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

ప్రపంచవ్యాప్తంగా 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు రూ.38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో 'గాడ్ ఫాదర్' మొదటి రోజు వసూళ్లు

  • నైజాం: రూ. 3.25 కోట్లు
  • ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు
  • సీడెడ్: రూ.3.05 కోట్లు
  • నెల్లూరు: రూ.57 లక్షలు
  • గుంటూరు: రూ.1.75 కోట్లు
  • కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు
  • తూర్పు గోదావ‌రి: రూ.1.60 కోట్లు
  • పశ్చిమ గోదావ‌రి: రూ.80 లక్షలు

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

వీకెండ్ వరకు 'గాడ్ ఫాదర్' హవా ఉంటుందా?
సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. దసరా సందర్భంగా 'గాడ్ ఫాదర్' సినిమా బుధవారం విడుదలైంది. ఈ వీకెండ్ వరకు విజయదశమి సెలవులు ఉన్నాయి. అప్పటి వరకు సినిమా బాక్సాఫీస్ బరిలో సినిమా హవా ఉంటుందా? లేదా? అనేది చూడాలి. మెగాస్టార్ అభిమానుల జోరు చూస్తుంటే వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.

మోహన్ లాల్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్'. మలయాళ సినిమాతో పోలిస్తే.. తెలుగులో చాలా మార్పులు చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ మాసీగా మార్చారు. మలయాళ సినిమాలో కొన్ని క్యారెక్టర్లను కట్ చేశారు. ఇంకొన్ని కొత్త సీన్లు రాసుకున్నారు. మోహన్ రాజా చేసిన మార్పులకు మంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఇవీ చదవండి:మళ్లీ ఆస్కార్​ రేసులో 'ఆర్ఆర్​ఆర్​'​.. క్యాంపెయిన్​ స్టార్ట్​.. వర్కౌట్​ అవుతుందా?

విడాకులపై వెనక్కి తగ్గిన ధనుష్​-ఐశ్వర్య!.. రజనీ 'పంచాయితీ' ఫలించిందా?

ABOUT THE AUTHOR

...view details