Al Pacino Becoming Father 4th Time : హాలీవుడ్ స్టార్ నటుడు అల్ పసినో (83) తండ్రి కాబోతున్నారు. ఆయన ప్రేయసి, సినిమా నిర్మాత నూర్ అల్ఫాల్లా(29) వచ్చే నెలలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని వారి సన్నిహితులు వెల్లడించారు. ఇప్పటికే అల్ పసినోకు ఇప్పటికే ఓ కూతురు(33), కవల పిల్లలు ఉండగా.. ఇప్పుడు నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా, 2022 నుంచి అల్ పసినో, నూర్ అల్ఫాల్లాతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా వార్త బయటకు వచ్చింది.
Al Pacino Relations : 'గాడ్ ఫాదర్' సినిమాతో ప్రపంచానికి పరిచయమయ్యారు అల్ పసినో. ఆయన 1988లో జాన్ టర్రంట్తో రిలేషన్షిప్ ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. వీరిద్దరికి 33 ఏళ్ల కూతురు ఉంది. ఆ తర్వాత పరిచయం ఏర్పడిన బెవెర్లీ డీ ఏంజెల్లోతో 1997 నుంచి 2003 వరకు ఆరేళ్ల పాటు సహ జీవనం చేశారు. వీరి దాంపత్య జీవిత సమయంలో కవల పిల్లలు జన్మించారు. అనంతరం అల్ పసినో.. బెవెర్లీ డీ ఏంజెల్లోతో విడిపోయిన నాలుగేళ్లకు 2008 నుంచి లుసిలా పొలాక్తో రిలేషన్లో ఉన్నారు. దాదాపు పదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు.. వ్యక్తిగత కారణాల వల్ల 2018లో బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం అల్ పసినో.. 29ఏళ్ల నూర్ అల్ఫాల్లాతో సహ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె సినీ నిర్మాత. ఆమె గతంలో సింగ్ మిక్ జాగర్ అనే వ్యక్తితో, తర్వాత ప్రముఖ పారిశ్రామిక వేత్త నికోలాస్ బెర్గ్ర్యూన్తో డేటింగ్ చేశారు.