Nagarjuna Goa Notice : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు గోవాలోని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో నాగార్జునకు సంబంధించిన నిర్మాణ పనులను ఆపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హీరో నాగార్జునకు షాక్.. గోవాలో 'అక్రమ' నిర్మాణాలు ఆపాలంటూ నోటీసులు - గోవా అక్రమ నిర్మాణాలు నాగర్జున
టాలీవుడ్ హీరో నాగార్జునకు గట్టి షాక్ తగిలింది. గోవాలో మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. 'అక్రమ' నిర్మాణాలను ఆపకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
goa notices to nagarjuna
"మాండ్రేమ్ పంచాయతీ సర్వే నెం.211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని మాండ్రేమ్ సర్పంజ్ అమిత్ సావంత్.. నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.
Last Updated : Dec 21, 2022, 4:10 PM IST