Ghost trailer launch: ప్రముఖ నటుడు నాగార్జున తాజాగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నాగార్జున లుక్, యాక్షన్ సీక్వెన్స్ అందరితోనూ అదరహో అనిపించేలా ఉన్నాయి. యాక్షన్‌తోపాటు థ్రిల్లింగ్ అంశాలూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. థీమ్‌కి తగ్గట్టు భరత్- సౌరభ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించారు. ఆమె కూడా ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గానే కనిపిస్తారు. ఇంటర్‌పోల్ అధికారి అయిన నాగార్జున ఖడ్గాన్ని ఎందుకు పట్టుకున్నారు? దాని ప్రత్యేకత ఏంటి? ఆపరేషన్‌ని పూర్తి చేశారా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.