ఫిలింనగర్ క్లబ్ అధ్యక్షుడిగా సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎన్నికయ్యారు. 324 ఓట్ల ఆధిక్యంతో ఆదిశేషగిరిరావు ప్యానెల్ ఘన విజయం సాధించడంపై కృష్ణ, మహేశ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.
అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కార్యదర్శిగా ముళ్ళపూడి మోహన్, కోశాధికారిగా రాజశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా వీవీఎస్ఎస్ పెద్దిరాజు ఎన్నికయ్యారు.