తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జర్మనీ ఎంబసీ సర్‌ప్రైజ్​.. దిల్లీ బిజీ మార్కెట్​లో 'నాటు నాటు'కు స్టెప్పులు - ఆర్​ఆర్​ఆర్​ నాటు నాటు కవర్​ సాంగ్​

ప్రస్తుతం ఎక్కడ చూసిన 'నాటు నాటు' పాట వినపడుతూనే ఉంది. తాజాగా జర్మనీ ఎంబసీ సిబ్బంది అంతా కలసి దిల్లీలోని చాందినీ చౌక్ వద్ద ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ పాటకు సూపర్​గా డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

german-ambassador and germany embassy staff dances-to-naatu-naatu-in-old-delhi
german-ambassador and germany embassy staff dances-to-naatu-naatu-in-old-delhi

By

Published : Mar 19, 2023, 2:18 PM IST

ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డు వరించడంతో 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో ఆస్కార్​ అవార్డు రావడంతో యావత్​ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 'నాటు నాటు' ఫీవర్​ తగ్గలేదు. ఎక్కడ చూసిన 'నాటు నాటు' పాట వినపడుతూనే ఉంది. అంతలా ఈ పాట.. ప్రజల్లో నాటుకుపోయింది. ఈ పాటకు సాధారణ పౌరులే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఫిదా అయ్యారు. విదేశీయులు కూడా ఈ పాటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా జర్మనీ ఎంబసీ సిబ్బంది 'నాటు నాటు' పాట ఆస్కార్ విజయాన్ని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. 'నాటు నాటు' పాటకు జర్మనీ అంబాసిడర్ చీఫ్ ఫిలిప్ అకేర్మాన్ స్టెప్పులు వేశారు. జర్మనీ ఎంబసీ సిబ్బంది అంతా కలసి దిల్లీలోని చాందినీ చౌక్ వద్ద అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ పాటకు డాన్స్ చేశారు. దీన్ని మొత్తం ఓ వీడియో రూపంలో రికార్డు చేశారు.

ఆ వీడియోను జర్మనీ అంబాసిడర్ ఫిలిప్ అకేర్మాన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక వీరు చేసిన వీడియోలో.. జర్మనీ ఎంబసీ సిబ్బంది దిల్లీ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈలోగా అక్కడ నాటు నాటు పాట ట్యూన్ వినగానే అందరికీ ఉత్సాహం మొదలవుతుంది. తర్వాత అంతా కలసి 'నాటు నాటు' అంటూ డాన్స్ చేస్తుంటే చుట్టుపక్కల వారంతా ఎగబడి చూస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

అంతకుముందు ఈ పాటకు సౌత్ కొరియా ఎంబసీ సిబ్బంది కూడా ఇలాగే డాన్స్ చేశారు. ఆ వీడియో ఇన్సిపిరేషన్​తోనే తాము కూడా ఈ వీడియో చేశామని జర్మనీ ఎంబసీ తెలిపింది. "నాటు నాటు పాట ఆస్కార్ విజయాన్ని మేము కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒరిజినల్ సాంగ్​తో పోలిస్తే మా డాన్స్ అంతగా బాగోలేదు. కానీ మేము చాలా ఎంజాయ్ చేశాం. నాటు నాటు పాటపై ఛాలెంజ్ ఓపెన్.. నెక్ట్స్ ఎవరు?" అంటూ జర్మనీ ఎంబసీ చీఫ్ ఫిలిప్ అకేర్మాన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వీరి డాన్స్.. సోషల్​మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ 'ఆర్ఆర్ఆర్ నా మజాకా నా' అంటూ మురిసిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details