Genelia Deshmukh Pregnancy : హా హా హా హాసినీ అంటూ తన అమయాక్వతంతో ప్రేక్షకులను కట్టిపడేసింది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు..'ఢీ', 'రెడీ', 'సై' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జెనీలియా.. బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. బాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్‌గా పేరొందిన ఈ జంటకు రియాన్, రాహ్యల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
అయితే తాజాగా జెనీలియా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యిందనే వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇటీవలే తన భర్త రితేశ్‌తో కలిసి ఆమె ఓ ఈవెంట్‌కు హాజరైంది. అక్కడ మీడియా వీరిని ఫొటోలు తీసింది. అందులో వైలెట్ కలర్ వన్ పీస్ డ్రెస్‌లో జెనిలీయా మెరిసింది. అయితే అందులో తనకు బేబీ బంప్ ఉన్నట్లు అనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఈ జంట తమ మూడో బేబీకి వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నారంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయంపై అటు జెనీలియా కానీ ఇటు రితేశ్గానీ స్పందించలేదు.
Genelia Latest Movie : ఇక జెనిలీయా.. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ గ్యాప్‌లోనూ తన ఇన్‌స్టా రీల్స్‌తో ప్రేక్షకులను పలకరిస్తూ ఉండేది. తన భర్త రితేశ్‌తో పాటు ఇతర స్నేహితులతో ఫన్నీ రీల్స్ చేస్తూ నెట్టింట మరింత పాపులరైంది. తాజాగా వేద్ అనే మారాఠీ సినిమాలో రితేశ్‌తో కలిసి మెరిసింది. తెలుగులో 'మజిలీ'గా తెరకెక్కిన సినిమాకు రీమేక్‌గా 'వేద్' తెరకెక్కింది.