తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తెలుగులోకి మరో డబ్బింగ్‌ చిత్రం.. 'కాంతారా'లా హిట్​ అవుతుందా? - వరుణ్​ ధావన్​ బేడియా తెలుగు రిలీజ్​

ఇటీవలే కాంతారాను తెలుగులో రిలీజ్ చేసి విజయోత్సాహంలో ఉన్న గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ఇప్పుడు మరో డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ సంగతులు..

varundhawan bhediya
తెలుగులోకి మరో డబ్బింగ్‌ చిత్రం.. 'కాంతారా'లా హిట్​ అవుతుందా

By

Published : Nov 2, 2022, 4:55 PM IST

కన్నడ నాట చిన్న సినిమాగా రిలీజై ఆ తర్వాత అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకున్న సినిమా కాంతార. బాక్సాఫీస్​ వద్ద సంచలనం సృష్టించింది. దీన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ విడుదల చేసింది. అయితే కాంతారా ఇచ్చిన విజయోత్సాహంతో ఈ సంస్థ.. మరో డబ్బింగ్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనుంది.

హిందీలో తెరకెక్కిన 'బేడియా'ను తెలుగులో 'తోడేలు' పేరుతో రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైంది. వరుణ్‌ధావన్‌, కృతి సనన్‌ జంటగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో తోడేలు కాటుకు గురైన భాస్కర్‌ అనే పాత్రలో వరుణ్‌ నటించగా, కృతి సనన్‌.. అనిక అనే వైద్యురాలిగా కనిపిస్తుంది. నవంబరు 25న ఈ సినిమా 2డీ, 3డీ వెర్షన్లలో విడుదలకానుంది.

ఇదీ చూడండి:ఈ కాంబోలకు ఉన్న క్రేజే వేరు​ స్క్రీన్​పై మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా

ABOUT THE AUTHOR

...view details