తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అల్లు అరవింద్ మాస్టర్​ ప్లాన్​.. అప్పుడు 'కాంతార'.. ఇప్పుడు 'విడుతలై' - కమెడియన్ సూరి విడుతలై సినిమా

విజయ్‌సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించిన చిత్రం 'విడుతలై పార్ట్‌ 1' విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడీ సినిమా త్వరలోనే తెలుగులో విడుదల కానుంది. ఆ వివరాలు..

vidutalai
అల్లు అరవింద్ మాస్టర్​ ప్లాన్​.. అప్పుడు 'కాంతార'.. ఇప్పుడు 'విడుతలై'

By

Published : Apr 5, 2023, 6:47 AM IST

Updated : Apr 5, 2023, 7:18 AM IST

'ఆడుగలం', 'అసురన్' చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్. తాజాగా ఆయన దర్శకత్వంలో రిలీజై సంచలన విజయం సాధించిన 'విడుతలై పార్ట్-1' తమిళనాడులో భారీ వసూళ్లను అందుకుంటోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఇందులో.. ఎప్పుడూ నవ్వించే కమెడియన్ సూరి ఈ సారి విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. ఇక విషయానికొస్తే.. గత కొంతకాలంగా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను ఆడియెన్స్​ ఆదరిస్తున్నారు. ఒక భాషలో తెరకెక్కిన సినిమా అక్కడ సూపర్ హిట్ అయితే ఇతర భాషల్లోనూ దాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలా కన్నడలో సంచలన విజయం సాధించిన 'కాంతార'ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ... అదే తరహాలో ఇప్పుడు తమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందుతోన్న 'విడుతలై పార్ట్‌ 1' సినిమానూ ఇక్కడి ఆడియెన్స్​కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.

"పిరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విడుతలై: పార్ట్ 1.. మార్చి 31న తమిళనాడులో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం వల్ల తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తాం" అని గీతా ఆర్ట్స్ ప్రతినిధులు తెలిపారు. కాగా, 'కాంతార' తర్వాత మలయాళ సినిమా 'మాలికాపురం' చిత్రాన్ని తెలుగులో రిలీజ్​ చేసి.. మంచి స్పందనను అందుకుంది గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌. దీంతో ఈ సంస్థ నుంచి విడుదలయ్యే చిత్రాలపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకుంటోంది.

ఇక విడుతలై సినిమా విషయానికొస్తే.. ఆర్​ఎస్​ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఎల్రెడ్ కుమార్ చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీసు కానిస్టేబుల్‌ కథతో పీరియాడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పటికే బాక్సాఫీస్​ ముందు దాదాపు రూ.15కోట్ల షేర్​.. రూ. 23 కోట్లకుపైగా గ్రాస్​ వసూళ్లను అందుకుంది. ఇప్పటివరకు సినిమాల్లో హాస్యనటుడిగా అలరించిన సూరి.. ఈ సారి సీరియస్‌ పాత్రలో కనిపించి, ప్రేక్షకులను కట్టిపడేశారు.

ఇదీ చూడండి:ఇండస్ట్రీలో ట్రెండ్​ సెట్​ చేసిన​ 'తొలి' సినిమాలు

Last Updated : Apr 5, 2023, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details