తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఏం మాయ చేసావెలో సామ్​ను రీప్లేస్​ చేసిన స్టార్ హీరోయిన్​.. ఇక తనే ఫిక్సా? - ఏం మాయ చేశావే 2 రష్మిక మందన్నా

అటు సాంగ్స్​ పరంగా ఇటు స్టోరీ పరంగా అప్పట్లో యువతను క్రేజీగా ఆకట్టుకున్న లవ్​స్టోరీ సినిమా ఏం మాయ చేసావే. ఇందులో చైతూ-సామ్​ కెమిస్ట్రీకి యూత్​ ఫిదా అయిపోయారు. అయితే త్వరలోనే రానున్న ఈ చిత్ర సీక్వెల్​లో సామ్​ ప్లేస్​ను ఆ హీరోయిన్​ రీప్లేస్​ చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

rashmika mandanna to replace in em maaya chesave 2
samantha

By

Published : Dec 28, 2022, 4:49 PM IST

'యశోద' సినిమాతో అటు యాక్టింగ్​తోనే కాదు ఇటు యాక్షన్​తోనూ ప్రేక్షకులను ఔరా అనిపించిన హీరోయిన్ సమంత. కెరీర్​ విభిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ.. 'ఏం మాయ చేసావే' సినిమాతో అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మాయ చేసింది. ఈ చిత్రంలో నాగచైతన్య-సామ్​ కెమిస్ట్రీ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత నిజంగానే ప్రేమలో పడ్డ చైతూ-సామ్ పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో 'ఏం మాయ చేసావే' చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుండు అని ప్రేక్షకులు ఆశించారు.

ఆశించినట్టే దాన్ని నిజం చేస్తూ కొద్ది రోజుల క్రితం దర్శకుడు గౌతమ్​ మేనన్​ కూడా స్వీక్వెల్​ను ప్రకటించారు. మూవీకి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతోందని చెప్పారు. దీంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు కొత్త అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే చైతూ-సామ్​ కొంత కాలం క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరు కలిసి ఈ సీక్వెల్​ నటిస్తారా లేదా? అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అది​ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ఇప్పుడు సెట్స్​పైకి అడుగు పెట్టనున్నట్లు టాక్​ నడుస్తోంది. అంతే కాకుండా ఇందులో చైతూ-సామ్​ విడాకులు తీసుకోబోతున్నట్లు చూపించనున్నారట. డివర్స్​ అయ్యాక చైతూ.. మళ్లీ ప్రేమలో పడతాడని.. ఆ అమ్మాయి పాత్రలో రష్మిక నటించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, నాగచైతన్య-సమంత విషయానికొస్తే.. వీరిద్దరూ ఏం మాయ చేసావేతో పాటు ఆటోనగర్ సూర్య , మనం, మజిలీలోనూ నటించారు. ఇవి కూడా మంచి విజయాలే సాధించాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details