తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా అభిమానించే కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. అందుకే అభిమానులు ఆమెకు 'లేడీ పవర్‌స్టార్' అనే బిరుదును కట్టబెట్టేశారు. నటనకు ఆస్కారమున్న, వినూత్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ నటనామయూరి అదే వరుసలో ‘'గార్గి' చిత్రంలో స్త్రీ ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా అలరిస్తుండగా, ఇంకా ఈ సినిమా విశేషాలను పంచుకోవటానికి ఆమె కూడా మన ముందుకు వచ్చారు. ఆమె మాటల్లో 'గార్గి' ఎవరంటే..
- ఈ సినిమా చేయటానికి ప్రత్యేక కారణమేంటి?
సాయిపల్లవి:ఈ కథను వినగానే ఎలాగైనా ఈ పాత్రను చేయాలనిపించింది. అందరి జీవితాలను టచ్ చేసే కథ ఇది. ‘వకీల్ సాబ్’, ‘జై భీమ్’లా సమాజానికి ఏదైనా చెప్పే ఆస్కారమున్న పాత్రను ఇందులో చేశా.
- అంటే కథ మొత్తం లాపాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందా?
సాయిపల్లవి:అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నాతో సమాంతరంగా ఒక లాయర్ పాత్ర సాగుతుంది. న్యాయం కోసం పోరాడే నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది.
- అసలు 'గార్గి' టైటిల్ వెనుక అంతరార్థమేమిటి?
సాయిపల్లవి:'గార్గి' మన పురాణాలలో స్త్రీపాధాన్యమున్న పాత్ర పేరు. ఆ పేరుకి న్యాయం చేసేలానే ఈ సినిమాలో గార్గి పాత్ర ఉంటుంది.
- ఈ సినిమాలో ఒక స్కూల్ టీచర్ పాత్ర చేశారు కదా?ఎలా అనిపించింది?
సాయిపల్లవి:నేను స్కూల్ లైఫ్‌ని చాలా తక్కువగా ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ నేర్చుకోవడానికి అటెండెన్స్ ఇచ్చి వెళ్లిపోయేదాన్ని. అటువంటిది ఈ సినిమాలో టీచర్‌గా నటించాకా వారెంత కష్టపడతారో తెలిసింది.
- ముందు ఈ కథ ఐశ్వర్య లక్ష్మీ దగ్గరికి వెళ్తే, ఆమె మీ పేరు ప్రతిపాదించారట?
సాయిపల్లవి:అవును. నిజానికి ఆమె, డైరెక్టర్ గౌతమ్ చంద్రన్ స్నేహితులు. ఆమె ఈ రోల్‌కి సాయిపల్లవి న్యాయం చేస్తుందని చెప్పారట. ఆమె కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం. కొన్ని పాత్రలకు న్యాయం చేసే పేర్లను నేనిలాగే ప్రతిపాదించాను.
- ఈ సినిమా ట్రైలర్‌లో స్త్రీ స్వేచ్ఛ గురించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి..దీనికి మీ సమాధానం
సాయిపల్లవి:అవును..నిజ జీవితంలో తల్లిదండ్రులతో అమ్మాయిల సంభాషణలు ఎలా ఉంటాయో ఈ డైలాగ్స్ అలానే ఉంటాయి. నిజజీవితంలో పాత్రలానే గర్గి పాత్ర ఉంటుంది.
- ఇటీవల అన్యాయంగా కేసుల్లో ఇరికించిన కథలనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. వాటికన్నా ఈ సినిమాలో ఏంటి ప్రత్యేకం?