తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Ganja Shankar Movie : సుప్రీం హీరో 'గాంజా శంకర్' గ్లింప్స్​ ఔట్.. 'లోకల్​ మ్యాన్'​గా పక్కా మాస్​లుక్​లో సాయిధరమ్ తేజ్!

Ganja Shankar Movie : టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్-సంపత్ నంది కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్​ను మూవీ యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది.

Ganja Shankar Movie
Ganja Shankar Movie

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 9:55 AM IST

Updated : Oct 15, 2023, 10:46 AM IST

Ganja Shankar Movie :మెగాహీరో సాయిధరమ్ ​తేజ్- దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సితారా ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ రూపొందిస్తున్నారు. అయితే ఆదివారం హీరో సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా.. మూవీటీమ్ సినిమా టైటిల్ అనౌన్స్​ చేసింది. ఈ చిత్రానికి 'గాంజా శంకర్' అనే పేరును ఖరారు చేస్తూ.. వీడియో గ్లింప్స్​ను కూడా రిలీజ్ చేసింది. 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలోతో హీరో క్యారెక్టర్ పక్కా మాస్​గా ఉండబోతుందని చెప్పె ప్రయత్నం చేశారు. ఇక గ్లింప్స్ రిలీజైన గంటకే లక్షల వ్యూస్​తో యూట్యూబ్​లో దూసుకుపోతోంది.

లోకల్ మ్యాన్ కథ.. ఈ సినిమాలో హీరో సాయిధరమ్​ తేజ్.. శంకర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక 'స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కథ కాదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి వాయిస్​తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ఇక హీరో చిన్నప్పుడే చదువు మానేశాడని.. అమ్మానాన్నలు చెబితే వినడని.. జర్దా, గుట్కా వంటి అన్ని అలవాట్లు ఉన్నాయని గ్లింప్స్​లో వివరించారు. అయితే హీరో శంకర్ గంజాయి అమ్ముతాడని క్లియర్​గా చెప్పేశారు.

డైలాగ్ కేక.. మాస్ లుక్​లో కనిపిస్తున్న గాంజా శంకర్.. 'పది ఉంటే పార్క్​లో పంటడు.. పది వేలుంటే పార్క్​ హయాత్​లో ఉంటడు' అనే డైలాగ్​ను గ్లింప్స్​లో జోడించి హైలైట్ చేశారు. అక ఆఖర్లో 'మాక్కికిరికిరి ఆబ్ షురు అస్లీ యాక్షన్' హీరో డైలాగ్​తో వీడియో ముగించేశారు. ఈ గ్లింప్స్​ చూసిన మెగా ఫ్యాన్స్​.. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో కమ్​బ్యాక్​ ఇచ్చేస్తాడని అంటున్నారు. ​

ఇక సినిమా విషయానికొస్తే.. హీరో సాయిధరమ్​కు ఇది 17వ చిత్రం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథానాయిక గురించి ఎలాంటి అనౌన్స్​మెంట్ చేయలేదు మూవీ యూనిట్. ఇక త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. సినిమా వచ్చే ఏడాదే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

''బ్రో' మూవీకి పవన్ రెమ్యునరేషన్.. ప్రపంచంలో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు'

Pawan kalyan : పవర్ స్టార్ సినిమాల్లో.. అత్యధికంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు ఎన్నో మీకు తెలుసా..?

Last Updated : Oct 15, 2023, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details