Gangs Of Godavari Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి హీరో విశ్వక్ సేన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని ఆయన అన్నారు. తొలుత అనుకున్న తేదీకే తమ సినిమా విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.
"మనకి బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్ మారుద్దామనే చూస్తాడు. నేను సినిమా చూడకుండా ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా.. డిసెంబర్ 8న మీ ముందుకు వస్తున్నాం. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం. అది మీ డెసిషన్.. ఆవేశానికో లేదా అహంకారంతోనో తీసుకునే నిర్ణయం కాదు. తగ్గే కొద్దీ మనల్ని ఇబ్బంది పెటాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్ 8న సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది.. డిసెంబర్ 8న సినిమా రిలీజ్ కాకపోతే ఇక నన్ను ప్రమోషన్స్‌లో చూడరు" అని విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.