తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రమోషన్స్​లో డిసెంబర్ సినిమాలు బిజీ - విశ్వక్​ సైలెన్స్​ వెనక కారణం ఏంటో ? - గ్యాంగ్స్ ఆఫ్​ గోదావరీ మూవీ న్యూస్

Gangs Of Godavari Release Date : రానున్న నెలలో బాక్సాఫీస్​ ముందు చిన్న చిత్రాల పాటు బడా మూవీస్ సందడి చేయనున్నాయి. 'సలార్​', 'హాయ్​ నాన్న'తో పాటు పలు మూటీ టీమ్స్​ ఇప్పటికే ప్రమోషన్స్​తోనూ బిజీ బిజీ అయిపోయాయి. అయితే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మాత్రం రిలీజ్ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

Gangs Of Godavari Release Date
Gangs Of Godavari Release Date

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 11:08 AM IST

Updated : Nov 21, 2023, 11:55 AM IST

Gangs Of Godavari Release Date : ఇటీవలే సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ నటుడు విశ్వక్​ సేస్​ పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. తన లేటెస్ట్ మూవీ'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల తేదీ విషయమై ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో పలు చర్చలకు దారి తీసింది. పరోక్షంగా ఆయన ఆ పోస్ట్​ను ఎవ్వరిని ఉద్దేశించి అన్నారో అర్థం కాక పలువురు తలలు పట్టుకున్నారు కూడా. అయితే ఈ సినిమాను డిసెంబరు 8న రిలీజ్ చేయాలని మేకర్స్​ ఎప్పుడో డిసైడయ్యారు. కానీ ఆ నెలలో ఉన్న సినిమాలన్నింటికి 'సలార్' ఎఫెక్ట్ పడిదిం. దీంతో పలు సినిమాలు తమ షెడ్యూల్స్​ను మార్చుకున్నాయి. కొత్త రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకున్నాయి. ఇందులో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' 'హాయ్ నాన్న', చిత్రాలు ఉన్నాయి.

అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్​లో నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ డిసెంబరు రెండో వారానికే ఫిక్స్ కావడం వల్ల ఈ డిసెంబర్​లో చిన్న చిత్రాలకు కాంపిటిషన్​ బాగా పెరిగిపోయింది. దీంతో హీరోలు కూడా సినిమా ప్రమోషన్ల విషయంలో బిజీ బిజీ అయిపోయారు. అయితే విశ్వక్ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఏ మాత్రం క్లారిటీ రాలేదు. బ్యాక్​గ్రౌండ్ లేకపోవడం వల్ల తనను తొక్కేస్తున్నారని, ఈ సినిమా రిలీజ్​ డేట్​ను మారిస్తే తాను ప్రమోషన్లకు రానన్నట్లుగా విశ్వక్ పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'గ్యాంగ్స్​ ఆఫ్​ గోదావరి పై పడింది'.

Vishwaksen Instagram Post :అయితే విశ్వక్ ఇలా ఓపెన్ స్టేట్​మెంట్​ ఇవ్వడం మూవీ టీమ్​కు కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో విడుదలను వాయిదా వేయకపోతే సినిమాకూ సమస్యే. దీంతో రిలీడ్​ డేట్​పై సందిగ్ధత నెలకొంది. కానీ తాజాగా నిర్మాత నాగవంశీ మాటల్ని బట్టి ఇప్పట్లో ఈ సినిమా విడుదలవ్వదనే అనిపిస్తోంది.

మరోవైపు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సైడ్​ నుంచి ప్రస్తుతం ఎటువంటి బజ్​ రావట్లేదు. సినీ హీరోలంతా తమ మూవీ ప్రమోషన్లలో సందడి చేస్తుంటే.. విశ్వక్​ మాత్రం ఇటువంటి వాటిలో అస్సలు కనిపించట్లేదు. ఇప్పటికే 'హాయ్ నాన్న' సినిమా ప్రమోషన్ల పరంగా ముందుండగా.. 'ఎక్స్‌ట్రార్డనరీ మ్యాన్​' కూాడా ప్రచారంలో కొంత సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకవేళ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ వీకెండ్‌ బరిలో ఉంటే కచ్చితంగా విశ్వక్ ఇప్పట్నుంచే ప్రమోషన్లలో జోరుగా ఉండేవాడని.. ఇప్పుడు తన ఊసే లేనందున ఈ సినిమా డిసెంబర్​ 8 న రాకపోవచ్చని అంచనా.

ఈ క్రమంలో సినిమా వాయిదా పడ్డా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ సోషల్ మీడియాలో ఇంకే రకమైన యాక్టివిటీ కూడా లేకపోవడం వల్ల.. విశ్వక్ తాను చెప్పినట్లే చేశారేమో అని ఫ్యాన్స్​ ఆరా తీస్తున్నారు. సినిమా వాయిదా పడితే ప్రమోషన్లకు రానన్న మాటకు.. కట్టబడి సైలెంట్ అయిపోయారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంపై విశ్వక్​ క్లారిటీ ఇచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.

Gangs Of Godavari Vishwak sen : 'తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారు.. గంగమ్మ తల్లిపై ఒట్టు.. అలా జరగకుంటే..'

Nani Hai Nanna : నాని దెబ్బకు.. బాక్సాఫీస్ ముందు కొత్త వార్​.. ఆ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారో?

Last Updated : Nov 21, 2023, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details