Game Changer Shooting : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో సార్లు వాయిదా వేసుకుంటూ షూటింగ్ జరుపుకుంటోంది. అసలీ చిత్రం ప్రకటించి చాలా కాలం అయినప్పటికీ కనీసం ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ అభిమానులు నిరాశ పడుతున్నారు.
వీటిన్నింటికీ కారణం ఈ చిత్ర దర్శకుడు శంకర్ రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం చేయడమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సాఫీగా సాగుతున్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మధ్యలో కమల్ హాసన్ 'ఇండియన్ 2'ను తీసుకొచ్చి చిత్రీకరణ ప్రారంభించారు. దీంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యం అవుతూ.. బడ్జెట్ పెరిగిపోతూ వెళ్తోంది. 'ఇండియన్ 2'పై క్లారిటీ వస్తున్నప్పటికీ.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో మాత్రం స్పష్టత రావట్లేదు. దీనికితోడు లీక్స్ కూడా ఎక్కువైపోవడం ఫ్యాన్స్‌ను బాగా హర్ట్ చేస్తుంది. ఇటీవలే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ సాంగ్ కూడా అనూహ్యంగా బయటకు వచ్చేసింది.
Gamechanger Release Date : అయితే తాజాగా 'ఇండియన్ 2' షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలిసింది. దీంతో ఇక శంకర్ దృష్టంతా.. 'గేమ్ ఛేంజర్'పైనే ఉంటుందని భావించారంతా. 'గేమ్ ఛేంజర్' జోరందుకుంటుందని ఆశించారు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ క్యాన్సిల్ చేశారని తెలిసింది.