Game Changer Sailesh Kolanu : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. అయితే మూవీ టీమ్ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. గతంలో దీపావళి కానుకగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే అది కూడా వాయిదా పడటం వల్ల ఇప్పుడు చెర్రీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకువచ్చింది. 'గేమ్ ఛేంజర్' సినిమాలోని కొన్ని సీన్స్‌ను 'సైంధవ్' సినిమా డైరెక్టర్ శైలేశ్ కొలను డైరెక్ట్ చేశానంటూ తనే స్వయంగా చెప్పారు. దీంతో పాటు గేమ్ ఛేంజర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్స్ మీరు డైరెక్ట్ చేసారంటూ టాక్ వచ్చింది. ఈ సినిమా ఎలా నడుస్తుందో ఓ సారి చెప్పగలరా"అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు శైలేశ్ ఆన్సర్ ఇచ్చారు.