తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Game Changer Movie : మెగా ఫ్యాన్స్ ఫుల్ సీరియస్​.. అలా చేయొద్దంటూ..! - Game Changer Leaked Song

Game Changer Leaked Song : గేమ్​ ఛేంజర్ టీమ్​కు షాక్ తగిలింది. ఓ సాంగ్ లీక్ అయింది. దీనిపై మెగా ఫ్యాన్స్​ సీరియస్ అవుతున్నారు.

Game Changer Leaked Song
Game Changer Leaked Song

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 11:38 AM IST

Updated : Sep 16, 2023, 12:14 PM IST

Game Changer Leaked Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయితే ఈ చిత్రానికి మొదట్లో లీక్​ల సెగ తగిలిన విషయమే. ఇప్పుడు మళ్లీ తాజాగా ఓ సాంగ్ లీక్​ అయింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే లీకైన సాంగ్​ ఫైనల్ వెర్షన్ కాదని తెలిసింది. టెస్టింగ్ సాంగ్ మాత్రమేనంట. మెయిన్ సాంగ్​ను స్టార్ సింగర్స్​తో పాడించడంతో పాటు ఫైనల్ మిక్స్ ఇంకా చాలా పనులు ఉన్నాయని తెలుస్తోంది. సౌండ్ మిక్సింగ్ అయ్యాక పాట మరింత బావుంటుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ లీక్ విషయంలో మేకర్స్ కూడా తగిన యాక్షన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఒరిజినల్ సాంగ్​ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు ఈ లీక్​పై మెగా ఫ్యాన్స్​ తీవ్రంగా మండిపడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే ఇలా చేయడం సరికాదని అంటున్నారు. దయచేసి షేర్ చేయడం ఆపండంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ సాంగ్​ బాగా వైరల్ అయిపోయింది.

సాంగ్​పై నెగటివ్ కామెంట్స్​..ఇకపోతే శంకర్ సినిమాల్లో పాటలు ఏ రేంజ్​లో ఉంటాయో తెలిసిందే. పాటలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అద్భుతమైన లిరిక్స్​ కళ్లు చెదిరి విజువల్స్​తో తెరకెక్కిస్తారు. అయితే ఈ లీకైన పాట లిరిక్స్ బాగోలేదని కామెంట్లు వస్తున్నాయి. తమన్ బీట్​ కూడా బాగోలేదని అంటున్నారు. చూడాలి మరి మూవీటీమ్​ సాంగ్​లో ఏమైనా మార్పులు చేస్తుందా అనేది..

ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. మూవీలో చరణ్‌ డబుల్ రోల్​లో కనిపిస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. రామ్‌ చరణ్​కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. విలక్షణ నటుడు ఎస్‌.జే.సూర్య, అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Pushpa 2 Gamechanger : 'పుష్ప 2' - 'గేమ్ ఛేంజర్'.. ఇక అప్పుడు కూడా డౌటే!

Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్​ రాజుకు కూడా తెలియదా?

Last Updated : Sep 16, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details