తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

​'ఆదిపురుష్​' టీమ్​పై ఆ థియేటర్ యజమాని ఫైర్​.. వారిని జైలులో పెట్టాలంటూ..

Adipurush Controversy : వరుస వివాదాలు చుట్టుముట్టిన వేళ 'ఆదిపురుష్' మేకర్స్​పై గైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ బహిరంగ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Adipurush Controversy
gaiety galaxy executive director manoj desai

By

Published : Jun 24, 2023, 10:33 AM IST

Adipurush Movie : మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్'​పై విమర్శల వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉంది. కంటెంట్​, వీఎఫ్​ఎక్స్, పాత్రల చిత్రీకరణ విషయంలో దర్శకుడు చేసిన తప్పిదాలను బయటకి తీసి నెట్టింట ఆడియన్స్​ దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ​గైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ కూడా ఇదే విషయం గురించి 'ఆదిపురుష్' మేకర్స్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు. 'ఆదిపురుష్ విషయంలో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు' అంటూ ఆగ్రహానికి గురయ్యారు.

"ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. నిన్న రెండు షోలు క్యాన్సిల్​ అవ్వగా.. బయట వస్తున్ననెగిటివిటీ వల్ల ఈ రోజు మ్యాట్నీని కూడా రద్దు చేయాల్సి వస్తోంది. ఇక అతి త్వరలో ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తారు. ఇలాంటి రోజు వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. మా థియేటర్​ మాత్రమే కాదు.. ఈ సినిమా ఉన్న అన్ని థియేటర్ల యజమానులు ఇప్పటికే నష్టపోయారు. ఈ వ్యక్తులపై (ఆదిపురుష్ నిర్మాతలు) కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. సినిమా నిర్మాణంలో పాల్గొన్న వారందరూ, ముఖ్యంగా రచయిత మనోజ్ ముంతాషీర్​ను జైలుకు పంపాలి." అని ఆయన ధ్వజమెత్తారు.

ఇక వివాదాస్పద డైలాగ్‌లను మేకర్స్ సవరించడంపై కూడా మనోజ్​ మాట్లాడారు. "వారు డైలాగ్‌లలో కొన్ని మార్పులు చేసారు, కానీ చాలా ఆలస్యం అయింది. విడుదల తర్వాత సినిమాలో డైలాగ్‌లను మార్చడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం" అని ఆయన అన్నారు.

నేపాల్​లో స్క్రీనింగ్స్​ షురూ..
Adipurush Screenings : 'ఆదిపురుష్'​లో సీతమ్మ జన్మస్థలంను భారత్​ అని చూపించినందుకు మండిపడ్డ నేపాల్​ ప్రభుత్వం.. ఆ సినిమాతో పాటు అన్నీ ఇండియన్​ సినిమాల స్క్రీనింగ్​ను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఆ నిషేదాన్ని ఎత్తివేసి.. శుక్రవారం నుంచి 'ఆదిపురుష్'​ తప్ప అన్ని సినిమాల స్క్రీనింగ్స్​ను పునః ప్రారంభించింది. ఈ విషయాన్ని నేపాల్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
Adipurush Day 8 Collections : కలక్షన్ల విషయంలో ఆదిపురుష్​ సినిమా క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. విడుదలైన 8వ రోజు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 3.25 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్​ వర్గాల టాక్​. థియేటర్లలో లో ఆక్యుపెన్సీ వల్ల పలు చోట్ల కొన్ని షోలు క్యాన్సిల్​ అయ్యాయని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details