Gadar 2 Box Office Collections : బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ 'గదర్ ఏక్ ప్రేమ్ కహానీ'కి సీక్వెల్‌గా తెరకెక్కిన 'గదర్ 2' ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సన్నీ దేవోల్, అమీషా పటేల్ లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ హిట్ టాక్ తెచ్చుకుని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుని చరిత్ర సృష్టిస్తోంది.
స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా అయితే 'గదర్ 2' రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. మంగళవారం ఈ సినిమా దాదాపు రూ. 56 కోట్ల కసలెక్షన్లను అందుకుని.. ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యధిక సింగిల్ డే నెట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ క్రమంలో మొత్తం 5 రోజుల్లో ఈ సినిమా రూ. 227 కోట్ల మేర వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాల టాక్.
అయితే అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఓ మై గాడ్ 2' సినిమా కూడా 'గదర్ 2'కు పోటీనివ్వడం వల్ల మంగళవారం ఈ సినిమా స్క్రీన్ కొరతను ఎదుర్కొంది. అయినప్పటికీ దాదాపు అన్ని సింగిల్ స్క్రీన్‌ల్లో పూర్తి ఆక్యుపెన్సీతో పాటు మల్టీప్లెక్స్‌ల్లో 90% ఆక్యుపెన్సీతో ఈ సినిమా నడవడం విశేషం. ఒకవేళ 'గదర్ 2' సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం మంగళవారమే ఈ సినిమా సుమారు రూ.70 కోట్ల గ్రాస్‌ని సులభంగా దాటుంటుందని ట్రేడ్ వర్గాల టాక్.