G20 Summit 2023 RRR Movie : 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఇండియా వైడ్‌గానే కాకుండా.. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు, పొలిటీషియన్స్.. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసల వర్షం కురిపించారు. తనకెంతో నచ్చిన ఇండియన్ మూవీ ఇదేనని అన్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ.. మూవీటీమ్ను మెచ్చుకున్నారు.
"ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నాకు బాగా నచ్చింది. 3 గంటలు నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్. ఫన్నీ సీన్స్, అద్భుతమైన సీన్స్, సూపర్ డ్యాన్సులు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో భారత్‌పై బ్రిటిష్ చేసిన ఆధిపత్యాన్ని చూపిస్తూ విమర్శ చేసినప్పటికీ.. దానిని కూడా ఎంతో అర్థవంతంగా చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత.. నేను ఎవరితో మాట్లాడినా.. ముందుగా నేడు అడిగే ప్రశ్న.. 'మీరు 'ఆర్‌ఆర్‌ఆర్' చూశారా?'. ఈ సినిమాను నేను బాగా ఎంజాయ్ చేశాను. మూవీటీమ్‌కు నా అభినందనలు" అని లూయిజ్ పేర్కొన్నారు.