'అఖండ' తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ.. 'వీరసింహారెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్‌తో పాటు సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు వసూలు చేసిన ఈ సినిమా బుధవారం సుమారు రూ.5.25 కోట్ల మేర రాబట్టిందని సమాచారం. మొత్తం కలెక్షన్లు రూ.100 కోట్లకుపైగా వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో మిలియన్ డాలర్ల దిశగా ఈ మూవీ దూసుకెళ్తోందని తాజా నివేదికలు వెల్లడించాయి.
ఓవర్సీస్లో బాలయ్య- వీరయ్య జోరు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సంగతేెంటి? - తెగింపు ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్
సంక్రాంతి బరిలో దిగిన అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
జోరులో ఉన్న 'వీరయ్య'..
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో వసూళ్ల పరంగా మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' దూసుకుపోతోంది. అమెరికాలో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రెండు మిలియన్ క్లబ్‌లో చేరింది. ఓవర్సీస్లో రెండు మిలియన్ల మార్కును అందుకున్న చిరంజీవి మూడో సినిమాగా వాల్తేర్ వీరయ్య రికార్డ్ క్రియేట్ చేసింది. తాజా నివేదికల ప్రకారం వాల్తేర్ వీరయ్య విడుదలైన ఆరో రోజు రూ.9.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు వాల్తేర్ వీరయ్య మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ రూ.109.60 కోట్లకు చేరుకుందని సమచారం..
వారసుడు వర్సెస్ తెగింపు..
'వారసుడు'కి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు మంచి స్పందనే వస్తోంది. నైజాంలో రూ.35 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 13 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి రూ. 1.25 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వసూలైనట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకు 'వారసుడు' ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లు కలెక్ట్ చేసినట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు తునివు కూడా సుమారు రూ.250 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్లు విషయంలో అదరగొట్టాయి.