Thangalaan Malavika Poster : మల్లు బ్యూటీ మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తంగలాన్' నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. అందులో ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఓ ఆయుధం, మెడ-నడుము-తల చుట్టూ ఏవో తాళ్ల లాంటివి వేసుకుని మాళవిక కనిపించింది. పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆరతి అనే పాత్రలో మాళవిక కనిపించనుంది. ఇక ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.
స్పూర్తిదాయకంగా 'ఘూమర్'.. సయామీకి గురువుగా అభిషేక్ ..
Abhishek Bacchan Ghoomar Trailer : బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం దర్శకుడు ఆర్. బాల్కీ తెరకెక్కిస్తున్న 'ఘూమర్' అనే సినిమాలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంగురాలైన ఓ క్రీడాకారిణిని విజయవంతమైన క్రికెటర్‌గా మార్చే కోచ్ పాత్రలో అభిషేక్ కనిపించనున్నారు.
ఇక దివ్యాంగ క్రీడాకారిణిగా సయామి ఖేర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 18న ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా, ఆసక్తిగా ఉన్న ఈ ట్రైలర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
ఆసక్తికరంగా టోబీ ట్రైలర్..
Toby Movie Trailer : 'గరుడ గమన వృషభ వాహన', '777 చార్లి' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి తాజాగా 'టోబీ' అనే చిత్రంలో నటించారు. గోపాలకృష్ణ దేశ్‌పాండే, రాజ్ దీపక్ శెట్టి, సంయుక్త హర్నాడ్ కీలక పాత్రలు పోషించారు. బసిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
భయపెడుతున్న అనన్య..
Ananya Nagalla Tantra Poster :'వకీల్‌సాబ్', 'మల్లేశం' లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న అనన్య నాగళ్ల లేటెస్ట్గా 'తంత్ర' అనే సినిమాలో కనిపించింది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఎంతో భయానకంగా ఉండే ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుశ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మర్యాద రామన్న హీరోయిన్ 'సలోనీ' ఈ సినిమాతో మరో సారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
'ఆకాశం దాటి వస్తావా' ట్రైలర్ చూశారా..
Akasam Dati Vastava Trailer : 'బలగం'తో మంచి సక్సెస్‌ను అందుకున్న దిల్‌రాజు ప్రొడక్షన్స్..తాజాగా 'ఆకాశం దాటి వస్తావా' అనే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తోంది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తోంది. శశి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.