తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిరు 'భోళా శంకర్'.. సిద్ధు 'టిల్లు స్క్వేర్​'​​.. ఆగస్టులో ఒకే రోజు 3సినిమాలు రిలీజ్​! - శివకార్తికేయన్​ మాహావీరుడు రిలీజ్​ డేట్​

ఆగస్ట్​ నెలలో పలు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అంతే కాకుండా అభిమానులు కూడా ఈ సినిమాలపై హై ఎక్స్​పెక్టేషన్స్​ పెట్టుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవంటే..

top stars films to release on august 11 2023
top stars films to release on august 11 2023

By

Published : Apr 23, 2023, 9:35 PM IST

Updated : Apr 24, 2023, 6:28 AM IST

సినీ ఇండస్ట్రీ తమ మార్కెటింగ్ స్ట్రాటజీని పాన్ ఇండియా లెవెల్​లోకి తీసుకెళ్లాక సినిమాల విషయంలోనూ ఎన్నో మార్పులు జరిగాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' లాంటి సినిమాలు టాలీవుడ్ రేంజ్​ను పెంచేశాయి. దీంతో ఇప్పటిదాక బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న మేకర్స్​.. ప్రస్తుతం ఆ విషయంలో కాంప్రమైజ్​ కాకుండా సినిమాలను భారీ బడ్జెట్లతో తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాలను కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజైన నాని 'దసరా' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ నటించిన 'విరూపాక్ష' కూడా 'దసరా' లాగే థియేటర్లలో మంచి రెస్పాన్స్​తో పాటు కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు ఇదే జోరులో పలు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు సినిమాలు ఆగస్టు నెలలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. అంతే కాకుండా అభిమానులు కూడా ఈ సినిమాలపై హై ఎక్స్​పెక్టేషన్స్​ పెట్టుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవంటే..

  • 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా - బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్ కపూర్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'యానిమల్'. ఇది ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. రణ్​బీర్​ నటించిన 'బ్రహ్మాస్త్ర', 'తూ ఝూఠి మైన్ మక్కర్' సినిమాలు మంచి టాక్​ సంపాదించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ ఈ 'యానిమల్‌' పైనే పెట్టుకున్నాడు రణ్​బీర్​ కపూర్​.
  • ఇక టాలీవుడ్​లో ఆగస్టు నెలలో మరో సినిమా రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. అదే మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'భోళా శంకర్​' మూవీ. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో మిల్క్​ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరు చెల్లి క్యారెక్టర్​లో కీర్తి సురేష్ నటిస్తోంది.
  • మరోవైపు సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్​గా వస్తున్న 'టిల్లు స్క్వేర్​' కూడా ఆగస్ట్ 11న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. కాగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
  • అంతే కాకుండా శివ కార్తికేయన్ నటిస్తున్న 'మాహావీరుడు' సినిమా కూడా ఆగస్టు 11న విడుదల కానుంది. 'మండేలా' ఫేమ్​ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు తమిళంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తెలుగులోనూ శివ కార్తికేయన్​ ఫ్యాన్స్​ ఈ సినిమాను ఆదరిస్తారని మేకర్స్​ ఆశిస్తున్నారు.
  • ఇదీ చదవండి:
  • బన్నీకి ఇన్‏స్టాలో 21 మిలియన్ల ఫాలోవర్స్..​ కానీ ఆయన మాత్రం ఆ ఒక్కరినే ఫాలో..! ఎవరో తెలుసా?
  • 'ఘోడే పే సవార్‌'.. ఈ సాంగ్​ పాడింది మన తెలుగమ్మాయే !
Last Updated : Apr 24, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details