Free Movie Websites : మీకు సినిమాలు అంటే చాలా ఇష్టమా? వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు చూస్తూ ఉంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేడు ఆన్లైన్లో పూర్తి ఉచితంగా, లీగల్‌గా సినిమాలు చూపించే.. బెస్ట్ వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూసే ముందు ప్రీమియం యాప్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం.
ప్రీమియం యాప్స్.. చాలా ప్రియం!
Premium Movie Sites : సాధారణంగా మంచి సినిమాలు, కొత్త సినిమాలు చూడాలంటే.. కచ్చితంగా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండే యాప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్, ఆహా లాంటి లెక్కకు మించిన ప్రీమియం యాప్స్ ఉన్నాయి. కానీ వీటి సబ్స్క్రిప్షన్ ధరలు మాత్రం.. మన జేబుల్ని ఖాళీ చేసేంత ఎక్కువగా ఉంటాయి.
పైరేటెడ్ వెబ్‌సైట్స్!
ప్రీమియం యాప్స్ చాలా ఖరీదుతో కూడుకున్నవి. అందుకే వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకోలేని వాళ్లు.. పైరసీ వీడియోలు లేదా ఐబొమ్మ లాంటి పైరేటెడ్ వెబ్సైట్లను చూస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల మీ ఎన్నో భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి. మీ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్లను చూడకపోవడమే మంచిది.
ఫ్రీ ఆన్లైన్ మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్స్
Online Movie Sites Free : ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో అనేక వెబ్సైట్లు పూర్తి ఉచితంగా, అదీ లీగల్‌గా.. వీడియో స్ట్రీమింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వాస్తవానికి చాలా సినిమాలకు కాపీరైట్ పీరియడ్ ముగిసి ఉంటుంది. అలాంటి సినిమాలు ప్రజలందరూ యాక్సెస్ చేయవచ్చు. అందుకే అలాంటి చిత్రాలను ఈ వెబ్సైట్లు అందిస్తూ ఉంటాయి. అయితే దీనిలో కేవలం కాలం చెల్లిన చిత్రాలు మాత్రమే ఉంటాయని అనుకుంటే పొరపాటు. చాలా పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా ఈ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే కొత్త రిలీజ్ చిత్రాలు మాత్రం వీటిలో ఉండవు.
ప్రకటనలు వస్తుంటాయి!
Free Online Movie Streaming Sites : మనం టీవీలో సినిమాలు చూసినప్పుడు ఎలా అయితే యాడ్స్ వస్తుంటాయో.. అలానే ఈ వెబ్‌సైట్స్‌లో కూడా సినిమాల మధ్యలో ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఆ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతోనే.. ఆయా వెబ్సైట్లకు ఆదాయం చేకూరుతుంది. ఓకే.. ఇప్పుడు బెస్ట్ ఫ్రీ మూవీ స్ట్రీమింగ్ యాప్స్.. వెబ్‌సైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Amazon Freevee
అమెజాన్ ఫ్రీవీని మొదట్లో IMDb TV అనేవారు. ఇందులో ఫ్రీ అమెజాన్ వీడియోలు, సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. వాస్తవానికి ఈ సర్వీస్‌ను 2019లో లాంఛ్ చేసింది అమెజాన్. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ అమెజాన్ ఫ్రీవీ ( Amazon Freevee Movies ) కంటెంట్‌ను మీరు.. ఫైర్ టీవీ, ఎక్స్‌బాక్స్, ప్లేస్టేషన్ తదితర స్ట్రీమింగ్ డివైజుల్లోనూ చూడవచ్చు.
2. Crackle
ఈ వెబ్సైట్లో సిండికేట్ కంటెంట్‌తో పాటు, Crackle సొంత ప్రొడక్షన్లోని సినిమాలు కూడా ఉంటాయి. దీనిలో ( Crackle Free Movies ) మూవీస్ మాత్రమే కాకుండా, క్రాకెల్కు సంబంధించిన టెలివిజయన్ షోలు, ఒరిజినల్ ప్రోగ్రామ్‌లు కూడా ఉంటాయి. వీటిని మీరు పూర్తి ఉచితంగా చూడవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ టీవీలో కూడా Crackle సినిమాలను, షోలను ఎంజాయ్ చేయవచ్చు.
3. CONtv
ఈ వెబ్‌సైట్‌ను మొదట్లో 'వ్యూస్టార్' అని పిలిచేవారు. దీనిలో (ConTv Horror Movies) లైవ్ టీవీ ప్రోగ్రాంలు, షోలు, మూవీలు ఉంటాయి. ముఖ్యంగా మంచి హారర్ సినిమాలు, బి-ఫిల్మ్‌లు ఇందులో ఉంటాయి. కొన్ని వీడియోలను చూడాలంటే.. సబ్స్క్రిప్షన్ అవసరం ఉంటుంది. కానీ చాలా వరకు ఉచిత సినిమాలు ఇందులో ఉంటాయి.
4. Vudu
ఇది డిజిటల్ వీడియో రెంటల్ అండ్ సేల్ వెబ్సైట్. కానీ ఇందులో చాలా సినిమాలు ఉచితంగా చూడవచ్చు. ( Vudu Free Movies ) దీనిలో ప్రత్యేకత ఏమిటంటే.. సరికొత్త సినిమాలు, షోలు.. తరచుగా అప్డేట్ అవుతూ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం మీరు ఈ వెబ్సైట్లో సినిమాలు చూడడం మాత్రమే కాదు.. వాటిని అద్దెకు తీసుకోవచ్చు. కొనుక్కోవచ్చు కూడా.
5. Popcornflix
ఈ వెబ్సైట్లో ఒరిజినల్ సినిమాను పూర్తి ఉచితంగా చూడవచ్చు. కానీ ( Popcornflix Free Movies ) మధ్యమధ్యలో లిమిటెడ్ ప్రకటనలు వస్తూ ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వెబ్సైట్లో సినిమాలు చూడడానికి రిజిస్టర్ కూడా కానవసరం లేదు.