First Singer To Charge 1 Crore Remuneration : సినీ పరిశ్రమలో గాయకులకు మంచి స్థానమే ఉంది. ముఖ్యంగా దివంగత ఎస్పీ బాలు, చిత్ర, శ్రేయా ఘోషల్ లాంటి వాళ్లకు కోట్లల్లో అభిమానులున్నారు. ఇలాంటి వారికి డిమాండ్ కూడా ఎక్కవే ఉంటుంది. ఎంత డిమాండ్ ఉన్నా.. ఒక పాటకు మహా అయితే రూ.20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునుంటారు. కానీ ఓ గాయని మాత్రం ఒక పాటకు ఏకంగా రూ. కోటి తీసుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్కి చెందిన గౌహర్ జాన్.. అసలు పేరు ఏంజెలీనా యోవార్డ్. వీరి పూర్వీకులు ఆర్మేనియన్ మూలానికి చెందినవారు. గౌహర్ తాత బ్రిటిష్ కాగా, అమ్మమ్మ హిందూ. ఈమె ఇండియాలోనే జన్మించారు. తల్లికి సంగీతంతో పాటు నృత్యంలోనూ నైపుణ్యం ఉన్నందు వల్ల.. గౌహర్కి ఆమె నుంచే ఆ రెండు కళలు వారసత్వంగా వచ్చాయి. అయితే ఆమెకు ఆరేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు.
అయితే విడాకుల తర్వాత గౌహర్ తల్లి.. ఖుర్షీద్ అనే వ్యక్తితో కలిసి బనారస్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అలా ఏంజెలీనా కాస్త.. గౌహర్ జాన్‌గా మారారు. కొంత కాలానికి గౌహర్ తల్లి మల్కా జాన్.. బనారస్‌లో ప్రముఖ గాయనిగా కథక్ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందారు. అయితే కొంత కాలం తర్వాత కూతురుతో కోల్‌కతాకు వెళ్లిన మల్కాజాన్.. అక్కడ నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానంలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.
ఇక గౌహర్ కెరీర్ విషయానికి వస్తే.. ఫోనోగ్రాఫ్ రికార్డ్ (గ్రామోఫోన్ సీడీ)లో పాటలు రికార్డ్ చేసిన మొదటి భారతీయ గాయకురాలిగా గౌహర్ రికార్డుకెక్కారు. భారత్‌లోని ప్రముఖ గ్రామోఫోన్ కంపెనీ ఆమె పాటలను విడుదల చేసింది. అయితే ఆమె ప్రతి పాటకు చివరిలో 'మై నేమ్ ఈజ్ గౌహర్ జాన్' అనే ఇంగ్లీష్ సిగ్నేచర్ చెప్పేవారు. ఇది అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.