First Indian Movie Overseas 100 Crores :ప్రస్తుతం భారతీయ సినిమాల స్థాయి ఎల్లలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు అదరగొడుతున్నాయి. భారీ వసూళ్లు రాబడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు ప్రపంచ సినీ అభిమానుల మెప్పు పొందుతున్నాయి. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకొణె, టాలీవుడ్ నుంచి ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ తదితరులు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.
వారు నటించిన సినిమాలు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. చెన్నై ఎక్స్‌ప్రెస్, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి చిత్రాలకు ఉత్తర అమెరికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో విపరీతమైన ఆదరణ లభించింది. గురిందర్ చద్దా సినిమా బెండ్ ఇట్ లైక్ బెక్‌హామ్, బ్రైడ్ అండ్ ప్రెజూడీస్ వంటి సినిమాలు దక్షిణాసియా దేశాల సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే భారతీయ దర్శకనిర్మాతల ప్రతిభే మన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో నిలిచేలా చేసింది. లంచ్ బాక్స్, వైట్ టైగర్, ఆర్ఆర్ఆర్ వంటి చలనచిత్రాలు కూడా అనేక విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాయి. భారతీయ సినిమాలోని మ్యూజిక్, డాన్స్, రొమాంటిక్ డ్రామా గ్లోబల్స్ ఆడియెన్స్‌ను మైమరింపజేస్తున్నాయి.