Fighter Teaser Release Date :బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 'ఫైటర్'. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. వయాకమ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మాతలు మమతా ఆనంద్, రామన్ చిబ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రబృందం తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 7న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు సిద్ధార్థ్ ఈ సినిమాను.. ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. హీరో హృతిక్.. ఫైటర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా.. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. అయితే షూటింగ్ ఇప్పటికే పూర్తైనప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది.
ముచ్చటగా మూడోసారి..హీరో హృతిక్ - డైరెక్టర్ సిద్ధార్థ్ కాంబోలో రానున్న మూడో సినిమా ఫైటర్. ఇదివరకు ఈ కాంబోలో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. ఇక హృతిక్ గత చిత్రం విక్రమ్ వేద.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది. దీంతో ఈ సినిమా ఊహించిన స్థాయిలో కలెక్షన్లు వసూల్ చేయలేదు. దీంతో హృతిక్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.