తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బికినీలో దీపిక- ఫుల్ ఎనర్జిటిక్​గా హృతిక్- 'ఫైటర్' సెకండ్ సాంగ్ చూశారా? - ఫైటర్ సినిమా టీజర్

Fighter Second Song Ishq Jaisa Kuch : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- బ్యూటీ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా ఫైటర్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్​ను విడుదల చేసింది మూవీ టీమ్.

Fighter Second Song Ishq Jaisa Kucht
Fighter Second Song Ishq Jaisa Kuch

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 7:01 PM IST

Fighter Second Song Ishq Jaisa Kuch : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్​, దీపికా పదుకొణె లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఫైటర్​'. యాక్షన్ సినిమాలకు కేరాఫ్​గా మారిన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. డిసెంబర్​ ప్రారంభంలో టీజర్​ను విడుదల చేశారు. ఆ తర్వాత వారం రోజుల లోపే ఫస్ట్ సాంగ్​ను విడుదల చేసింది మూవీ టీమ్. తాజాగా రెండో సింగిల్​ కూడా వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్​లో ఈ పాట ట్రెండింగ్ అవుతోంది.

'ఫైటర్' నుంచి 'ఇష్క్ జైసాకుచ్​' అనే రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో షర్ట్ లెస్​గా హృతిక్, బికినీలో దీపిక బీచ్​లో దర్శమిస్తున్నారు. బీచ్​​లో వీరిద్దరి మధ్య రొమాన్స్ స్పెషల్​ హైలైట్​గా ఉంది. అలాగే హృతిక్​కు దీటుగా దీపికా డ్యాన్స్ స్టెప్స్​తో అదరగొట్టింది. ఎప్పటిలాగానే హృతిక్ డ్యాన్స్ అదిరిపోయింది. మొత్తంగా హృతిక్​, దీపిక మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. 'ఫైటర్'​ సినిమాకు ఈ పాట స్పెషల్​ అట్రాక్షన్​గా మారింది.

Fighter movie cast: ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) అనే పాత్రలో క‌నిపించ‌నున్నారు. మరో స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే) మెరవనుంది. ఇక గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ మ్యూజిక్​ సెస్సేషన్​ విశాల్​- శేఖర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించారు.

హీరో హృతిక్ - డైరెక్టర్​ సిద్ధార్థ్ కాంబోలో రానున్న మూడో సినిమా ఫైటర్. ఇదివరకు ఈ కాంబోలో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. ఇక హృతిక్ గత చిత్రం విక్రమ్ వేద బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది. దీంతో ఈ సినిమా ఊహించిన స్థాయిలో కలెక్షన్లు వసూల్ చేయలేదు. దీంతో హృతిక్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

'టాప్​గన్ : మెవరిక్​' రేంజ్​లో 'ఫైటర్​' టీజర్- యాక్షన్​ మోడ్​లో హృతిక్, దీపిక

హృతిక్ 'ఫైటర్' అప్​డేట్ - టీజర్ వచ్చేది అప్పుడే

ABOUT THE AUTHOR

...view details