Sarkaru vaari pata Mahesh Galmour secret: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 46 ఏళ్లు వచ్చినా ఇంకా గ్లామర్‌గా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ సినీప్రియులు, అమ్మాయిల మనసును దోచేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీలో అంతకముందు కన్నా మరింత గ్లామర్‌గా, సరికొత్త లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మహేశ్ అంత హ్యాండ్సమ్గా కనిపించడానికి గల కారణాన్ని చెప్పారు.
Sarkaruvaari pata: మహేశ్ గ్లామర్ పెరగడానికి అసలు కారణం అదేనట! - Mahesh Galmour secret
Sarkaru vaari pata Mahesh Galmour secret: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గ్లామర్ సీక్రెట్‌ను లీక్ చేశారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్. దీంతోపాటే మహేశ్ ఎంతో క్రమశిక్షణగా ఉంటారని, ఎప్పుడూ వర్క్‌పైనే దృష్టి పెడతారని చెప్పుకొచ్చారు.
"మహేశ్ ఇంత అందంగా, కూల్‌గా, ఛార్మింగ్‌గా కనిపించడానికి కారణం ప్రతిరోజు ధ్యానం చేయడమే. ఆయన రోజు మూన్ యోగా చేస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు రెండు పూటలా యోగా, వర్కౌట్స్ చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారన్ని తీసుకుంటారు. ఎక్కువ మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటూ పని మీద మాత్రమే దృష్టి పెడతారు. క్రమశిక్షణగా ఉంటారు. ఇదే ఆయన గ్లామర్ సీక్రెట్. అందుకే ఆయన ఇంత కూల్‌గా, ఛార్మింగ్ లుక్‌లో కనిపిస్తారు" అని రామ్-లక్ష్మణ్ అన్నారు.
ఇదీ చూడండి: విజయ్ 'జనగణమన'లో హీరోయిన్ ఈ ముద్దుగుమ్మేనా?