సున్నితమైన ప్రేమకథలతో ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. ఆయన చిత్రాలన్నీ మంచి కాఫీలా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. జ్ఞాపకాల ఊసుల్లో హాయిగా ఊరేగిస్తుంటాయి. అయితే ఆయన డైరెక్షన్ చేసిన సినిమాల్లో ఫిదా ఎంతటి విజయం సాధించిందో తెలిసిన విషయమే. సాయిపల్లవి, వరుణ్‌తేజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.
ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులందరికీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ప్రతి పాత్ర అంతలా ఆడియెన్స్ మదిని తాకాయి. అయితే సాయి పల్లవి అత్త క్యారెక్టర్లో చేసిన ఆమె ఎవరో మీకు తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ అమ్మ. ఈమె పేరు గీత భాస్కర్. ఈ సినిమాలో ఆమె చాలా నేచురల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా నటించి మెప్పించారు.