Chiranjeevi Fathers day: ఒక గొప్ప తనయుడిగా.. గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాదర్స్ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం తన తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఓ ప్రత్యేక చిత్రాన్ని ఆయన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఇంకా చిరంజీవితోపాటు మహేశ్‌బాబు, శ్రీనువైట్ల, బండ్ల గణేశ్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
"నాన్నా అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్నా.. మీరే కనుక లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు"
- మహేశ్‌బాబు.
"ఈ విశ్వసృష్టికి భగవంతుడు కారణమైతే.. మన సృష్టికి తల్లిదండ్రులు కారణం. అమ్మ నడక నేర్పితే.. నాన్న నడత నేర్పుతాడు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు"
- పరుచూరి గోపాలకృష్ణ