ప్రముఖ కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకి పుత్రోత్సాహం కలిగిన విషయం తెలిసిందే. ఈ జంట కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ సామాజిక మాధ్యమాల వేదికగా ఆదివారం ప్రకటించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ జోడీ సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చారు. కొందరు వీరికి శుభాకాంక్షలు తెలపగా మరికొందరు విమర్శిస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే నయనతార పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ మరొకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. అదేంటంటే, నయనతార కవలలకు జన్మనిస్తుందన్న సంగతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేశారు. అదేంటి తారక్‌కు ఎలా తెలుసని అనుకుంటున్నారా?.. నయన్-తారక్ కలిసి అదుర్స్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. చారిగా తారక్ అదిరిపోయే పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ సీన్ ఉంటుంది.