తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' తారలకు పాలాభిషేకం.. థియేటర్ల వద్ద కోలాహలం - మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ 1 సినిమా

Ponniyin Selvan Release : ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. మొదటి రోజు థియేటర్ల వద్ద పండగ వాతావరణం కొనసాగుతోంది. తమకు ఇష్టమైన నటుల కటౌట్​లకు పాలాభిషేకాలు చేస్తున్నారు అభిమానులు.

ponniyin selvan release date
ponniyin selvan release date

By

Published : Sep 30, 2022, 1:42 PM IST

Ponniyin Selvan Release : టీజర్‌తోనే తన సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూపించారు అగ్ర దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1'. విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. దీంతో కోలీవుడ్​ అభిమానులు సెలెబ్రేషన్స్​ హోరెత్తిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు కావడం.. తమిళ అగ్ర తారలు నటించడం వల్ల ఈ సినిమాకు భారీ క్రేజ్​​ ఏర్పడింది. సినిమా విడుదల సందర్భంగా అభిమానులతో తమిళనాడులోని థియేటర్లు కోలాహంలంగా మారాయి.

అభిమానులతో కలిసి సినిమా చూసిన తారలు
కార్తి కటౌట్​కు పాలాభిషేకం చేస్తున్న అభిమాని

చెన్నై కోయంబెడులోని రోహిని సిల్వర్​ స్క్రీన్ థియేటర్​కు భారీగా అభిమానులు తరలివచ్చారు. నటుల​ కటౌట్​లకు పాలాభిషేకాలు చేశారు. టపాసులు కాల్చి హోరెత్తించారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. మరోపక్క కార్తీ, త్రిష, విక్రమ్, జయరామ్​ అభిమానులతో కలిసి చెన్నైలోని ఫోరమ్ మాల్​లో 'పొన్నియన్ సెల్వన్​ 1' చూశారు. దాదాపు రెండేళ్ల నుంచి షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. అయితే 'పొన్నియిన్‌ సెల్వన్‌' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు తరలివచ్చిన అభిమానులు
థియేటర్ల వద్ద డప్పు వాయిద్యాలతో అభిమానుల సందడి

ABOUT THE AUTHOR

...view details