తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2'.. సేతుపతి వర్సెస్​ మనోజ్ బాజ్​పాయ్​.. అవకాశం దక్కేదెవరికో? - పుష్ప 3

ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ నటించనున్న కొత్త చిత్రం 'పుష్ప 2'లోని ఓ పాత్ర కోసం విజయ్​సేతుపతి, మనోజ్​బాజ్‌పాయ్‌ను దర్శకుడు సుకుమార్​ సంప్రదించినట్లు తెలిసింది. మరి ఈ రోల్​ ఎవరు చేస్తారో?

pushpa 2
పుష్ప 2

By

Published : Jul 19, 2022, 8:04 PM IST

Updated : Jul 20, 2022, 11:37 AM IST

Pushpa 2 Manoj Bajpayee: ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ నటించనున్న కొత్త చిత్రం 'పుష్ప 2'. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ మూవీ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త వస్తూనే ఉంది. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో వార్త హల్​చల్​ చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'పుష్ప 2'లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల, ముంబయి వెళ్లిన దర్శకుడు సుకుమార్.. మనోజ్‌ బాజ్‌పాయ్‌కి 'పుష్ప'లోని పాత్ర గురించి వివరించినట్లు, ఆ పాత్రపై ఆయన ఆసక్తి చూపినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, ఇదే పాత్ర కోసం విజయ్​ సేతుపతితో కూడా మాట్లాడరని అంతకుముందు ప్రచారం సాగింది. మరి ఆ అవకాశం మనోజ్‌కే దక్కుతుందా, సేతుపతికా, మరొకరికా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. గతంలో అల్లు అర్జున్‌ 'హ్యాపీ', 'వేదం', పవన్ కల్యాణ్ 'పులి'లో నటించి ఆకట్టుకున్నారు. ఇటీవలే 'ఫ్యామిలీమ్యాన్‌' వెబ్‌సిరీస్‌తో మరింత మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారాయన.

మరో పుష్ప..!ఇంతవరకు'పుష్ప 2'నే సెట్స్​పైకి వెళ్లలేదు.. కానీ 'పుష్ప 3' ప్రచారం తెరపైకి వచ్చింది. తొలి భాగంలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన మలయాళీ స్టార్​ ఫహద్‌ ఫాజిల్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ ఫ్రాంఛైజీపై స్పందించారు. 'ముందుగా ఒక్క సినిమాలోనే 'పుష్ప' కథ చెప్పాలనుకున్నారు దర్శకుడు సుకుమార్‌. నాకు స్క్రిప్టు వినిపించినప్పుడూ ఒకటే అన్నారు. త్వరాత, రెండు భాగాలుగా మారింది. 'పుష్ప 3'కీ కావాల్సినంత మెటీరియల్‌ ఆయన దగ్గర ఉంది" అని ఆయన తెలిపారు. దీంతో 'పుష్ప 3' ఉందంటూ బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: క్రేజీ ఫ్యాన్స్.. అభిమాన హీరో కోసం 'వెయ్యి' అడుగుల బ్యానర్.. హైవేపై రోడ్​ షో

Last Updated : Jul 20, 2022, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details