తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయవాడలో 'ఎఫ్-3' సినిమా బృందం సందడి - విజయవాడలో ఎఫ్3 టీమ్

F3 Movie Team : ఎఫ్-3 సినిమా బృందం ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో సందడి చేసింది. తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజలను కోరింది. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల ఆధారంగానే ఈ సినిమా కథ ఉంటుందని సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఎఫ్-3 విజయం సాధిస్తే ఎఫ్-4 కూడా తీస్తామని చెప్పారు.

F3 Movie Team
F3 Movie Team

By

Published : May 26, 2022, 8:37 AM IST

విజయవాడలో 'ఎఫ్-3' సినిమా బృందం సందడి

F3 Movie Team : ఎఫ్-3 సినిమా బృందం ఏపీ విజయవాడలోని ఓ అపార్ట్‌మెంట్ ప్రాంగంలో సందడి చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్​లో భాగంగా విజయవాడకు వచ్చిన చిత్ర బృందం తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజలను కోరింది. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల ఆధారంగానే ఈ సినిమా కథ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.

విజయవాడకు రావటం సంతోషంగా ఉందని హీరో వరుణ్ తేజ్ అన్నారు. సీనియర్ నటుడు వెంకటేశ్​తో కలిసి రెండు సినిమాల్లో పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. టికెట్ల రేట్లు పెంచటం లేదని సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఎఫ్-2 సినిమా కన్నా ఎఫ్-3 మరింత ఫన్నీగా ఉంటుందని, ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రమన్నారు. ఎఫ్-3 విజయం సాధిస్తే ఎఫ్-4 కూడా తీస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details