తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఎఫ్​ 3'కి కొనసాగింపుగా 'ఎఫ్​ 4'.. మూవీటీమ్​ ఏం చెప్పిందంటే? - ఎఫ్ 3 మూవీ సీక్వెల్​

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన 'ఎఫ్​ 3' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సీనియర్‌ ఎడిటర్‌ తమ్మిరాజు.. చిత్రానికి సంబంధించిన ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ సంగతులివీ..

F3 movie
F3 movie

By

Published : May 4, 2022, 7:40 AM IST

F3 movie: "నేనెప్పుడూ సినిమా కథ వినను. వింటే ఇలా ఉంటుందని ఫిక్స్‌ అయిపోతాం. రష్‌లో అది లేకపోతే ఇలా ఎందుకైందనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకే నా వరకు నేను రష్‌ ప్రకారమే కథ అర్థం చేసుకొని.. ఎడిటింగ్‌ చేస్తా" అన్నారు సీనియర్‌ ఎడిటర్‌ తమ్మిరాజు. ఆయన ప్రస్తుతం 'ఎఫ్‌3'కి పని చేస్తున్నారు. వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రమిది. అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 'ఎఫ్‌3' విశేషాలను తెలిపారు.

‘ఎఫ్‌2’తో పోల్చితే ‘ఎఫ్‌3’ ఎలా ఉండనుంది?

"ఎఫ్‌2’లో ఉన్న పాత్రలే ఇందులోనూ కనిపిస్తాయి తప్ప కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ‘ఎఫ్‌3’ పూర్తిగా డబ్బు చుట్టూ తిరిగే కథ. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఈ అంశాన్నే దీంట్లో చాలా వినోదాత్మకంగా చూపించాô. ‘ఎఫ్‌2’ కంటే ‘ఎఫ్‌3’లో డబుల్‌ ఫన్‌ ఉంటుంది. దీంట్లో ప్రత్యేకంగా సందేశాలు ఏమీ లేవు కానీ, డబ్బు గురించి చెప్పే కొన్ని పాయింట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే సినిమాలో వెంకటేష్, వరుణ్‌తేజ్‌.. మిగతా నటీనటులు అద్భుతంగా చేశారు. దీనికి కొనసాగింపుగా ‘ఎఫ్‌4’ ఉందో లేదో? నాకు తెలియదు. అయితే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది".

ఇలాంటి కామెడీ సినిమాని ఎడిట్‌ చేయడం ఎలా అనిపిస్తుంది?

"ఇదనే కాదు.. వాస్తవానికి కామెడీ సినిమాల్ని ఎడిటింగ్‌ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్‌ రావిపూడి సినిమాల్లో అన్ని కామెడీ పంచ్‌లు బాగుంటాయి. దానిలో ఏది ట్రిమ్‌ చేయాలన్నా కష్టంగానే ఉంటుంది. కథా గమనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది అవసరమో అదే ఉంచుతాం. ఒకవేళ రీషూట్స్‌ చేయాల్సిన అవసరం ఏర్పడితే.. నేను, దర్శకుడు, నిర్మాత అందరం కూర్చొని చర్చిస్తాం. ఆ తర్వాత ఏది అవసరమో.. కాదో దర్శక నిర్మాతలే తుది నిర్ణయం తీసుకుంటారు".

పాన్‌ ఇండియా ప్రభావం ఎడిటింగ్‌పై ఎలా ఉంది?

"సినిమాకి తగ్గట్లుగా ఎడిటింగ్‌ విషయంలో చిన్న చిన్న మార్పులుంటాయి తప్ప ప్రత్యేకంగా పాన్‌ ఇండియా ప్రభావమంటూ ఏమీలేదు. నేను ‘బాహుబలి’కి ఎడిటర్‌గా చేశా. రాజమౌళి నాకా క్రెడిట్‌ ఇచ్చారు. నాకు తెలిసి పాన్‌ ఇండియా సినిమాల విషయంలో అన్ని భాషలు తెలిసిన ఎడిటర్‌ ఉంటే బావుంటుందని మేకర్స్‌ భావిస్తుంటారు అంతే".

లీకేజీలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

"లీకేజీలను ఆపాలంటే స్వీయ నియంత్రణ అవసరం. ఎందుకంటే సినిమా వర్క్‌ జరుగుతున్నప్పుడు పుటేజ్‌ చాలా చోట్లకు వెళ్తుంది. అక్కడ పని చేసే వాళ్లకి లీక్‌ చేయడం తప్పు అనే సంస్కారం ఉండాలి. అందుకే స్వీయ నియంత్రణ ఉన్నప్పుడే దాన్ని నియంత్రించగలం".

ఇంతకీ మీ 20ఏళ్ల సినీ ప్రయాణం ఎలా ఉంది?

"చాలా సంతృప్తికరంగా ఉంది. 1998లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఎడిటర్‌గా కెరీర్‌ ప్రారంభించా. ‘శాంతి నివాసం’ సీరియల్‌ నుంచి ‘బాహుబలి’ సినిమాల వరకు దాదాపు 18ఏళ్లు రాజమౌళితో పని చేశాను. ఇప్పటివరకు దాదాపు 30 చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశాను. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’, నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రాలకు పనిచేస్తున్నా".

ఇదీ చూడండి: ఫ్యాన్స్​కు ట్రీట్​.. నెక్ట్స్​ లెవెల్​లో మహేశ్​ సిగ్నేచర్‌ మూమెంట్స్‌!

ABOUT THE AUTHOR

...view details