వెంకటేశ్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్3’. తమన్నా, మెహ్రీన్ కథానాయికలు. బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయిక సోనాల్ చెప్పిన ముచ్చట్లు..
'ఎఫ్3'లో ఆఫర్ ఎలా వచ్చింది?
సోనాల్:అనిల్ రావిపూడి నాకు 'లెజెండ్' సినిమా అప్పుడు పరిచయం. ఆ సినిమా షూటింగ్ అప్పుడే మాట్లాడుకున్నాం. ఒకరోజు ఆయన ఫోన్ చేసి 'ఎఫ్3'లో ఒక పాత్ర ఉంది. మీరైతే బాగుంటుంది అన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. 'ఎఫ్2'ని మించిన నవ్వులు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది.
'ఎఫ్3' ట్రైలర్‌లో మీరు కనిపించలేదు. ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
సోనాల్:అది చాలా సీక్రెట్. చాలా కీలక పాత్ర. అందుకే ట్రైలర్‌లో కనిపించలేదు. నా పాత్రతో సినిమా మలుపు తిరుగుతుంది. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఫుల్‌లెంగ్త్ కామెడీ మూవీలో నటించడం ఇదే తొలిసారి. చాలా ఛాలెంజ్‌గా అనిపించింది. కామెడీ చేయడం అంత సులభం కాదని అర్థమైంది. మొదట చాలా కంగారు పడ్డా. 'నా పాత్ర కోసం ఏమైనా సినిమాలు చూడమంటారా' అని దర్శకుడిని అడిగా. ఆయన చాలా కూల్‌గా 'షూటింగ్‌కి వచ్చేయండి' అని చెప్పారు. ఆయనకు పని పట్ల చాలా నిబద్ధత ఉంటుంది. అందుకే ఆర్టిస్టులకు ఆయన దర్శకత్వంలో నటించడం చాలా సులభంగా అనిపిస్తుంది.