F3 movie collections: ఈ వేసవిలో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్-3'. అనిల్ రావిపూడి దర్శకుడు. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఎఫ్-2' చిత్రానికి ఫ్రాంచైజీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మే 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని 'ఎఫ్ 3' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిత్ర నిర్మాత దిల్‌రాజు తెలిపారు.
దిల్‌రాజు మాట్లాడుతూ.. "ఎఫ్-3 సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. 'ఎఫ్-2', 'ఎఫ్-3'లను మించేలా 'ఎఫ్-4' ఉండేలా అనిల్ రావిపూడి ఇప్పటి నుంచే కథ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే 'ఎఫ్-4'పై అధికారిక ప్రకటన, ఇతర వివరాలు తెలియజేస్తాం" అని అన్నారు.