కామెడీ టైమింగ్, వైవిధ్యమైన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు రాకింగ్ రాకేశ్. అందుకే చాలా తక్కువ కాలంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్‌లో టీమ్‌లీడర్ స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు జోర్దార్ సుజాతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుజాత.. రాకేశ్ టీమ్ ద్వారా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ తమ స్కిట్లలో కడుపుబ్బా నవ్విస్తూనే లవ్‌ట్రాక్‌ను నడిపించారు. మొదట ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత నిజజీవితంలోనూ ప్రేమపక్షులుగా మారారు.
'పెళ్లే వద్దు'... అసలు నాకు పెళ్లే వద్దు అంటూ జబర్దస్త్‌లో డైలాగ్ కొట్టిన రాకేశ్.. ఇప్పుడు సుజాతతో కలిసి లవ్‌ట్రాక్ నడిపించడం ప్రారంభించాడు. 'ఈ పెళ్లితో నీకు కన్నీళ్లు రావని చెప్పను.. కష్టాలు రావని చెప్పను.. కానీ ఈ రెండూ ఉన్నప్పుడు నీ పక్కన నేను ఉంటానని మాత్రం డెఫినెట్‌గా చెప్తా" అంటూ ఒక్క డైలాగ్ చెప్పి సుజాత మనసును దోచాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విషయాలు, వీడియోలు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్.. ఈ జోడీతో ముచ్చటించింది. వారి ప్రేమ సంగతులను అడిగి తెలుసుకుంది. దీనిపై మాట్లాడిన రాకేశ్.. తామిద్దరు జబర్దస్త్ ద్వారానే దగ్గర అయినట్లు చెప్పాడు. తమ మధ్య బంధాన్ని వివరించాడు.
"మాది నిజమైన ప్రేమే.. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తనకు జబర్దస్త్‌లో చేయాలని ఆసక్తి ఉందని తెలిసి.. అప్పటికే వేరే కామెడీ షోలో చేస్తున్న తనను ఇక్కడికి తీసుకొచ్చాను. తను జబర్దస్త్‌లోకి వచ్చేటప్పటికే బాగా ఫేమస్. ఇక్కడ కలిసి పనిచేస్తున్న క్రమంలో మా బంధం బలపడింది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తను అర్థం చేసుకోలదు. అంతకుమించిన అదృష్టం మరోటి లేదు. మనకు స్వచ్ఛమైన ప్రేమ దొరికినప్పుడు తీసుకోకపోతే మళ్లీ రాదని నా అభిప్రాయం."
- రాకింగ్ రాకేశ్