Extra Jabardast Rocking rakesh sujatha marriage: ప్రేమ.. ఎప్పుడు ఎలా అయినా పుట్టొచ్చు. ఇక నటీనటుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర విషయానికొస్తే.. కొన్ని జోడీలు కేవలం 'షో' కోసం లవ్ ట్రాక్ నడిపితే మరికొందరేమో నిజంగానే ప్రేమలో మునిగితేలుతాయి. అలాంటి జోడీనే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి పీటలెక్కి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్'వేదికగా వీరి వివాహం జరిగింది. అక్కడే ఉన్న కంటెస్టెంట్లు, జడ్జీలు వారికి కంగ్రాట్స్ తెలిపారు. 'స్పెషల్ మూమెంట్స్ ఆన్ స్టేజ్' పేరుతో ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలను.. షోకు సంబంధించిన తాజా ప్రోమోలో చూపించారు. "నీకు కన్నీళ్లు రావని చెప్పను. కష్టాలు రావని చెప్పను. కానీ ఆ రెండు వచ్చినప్పుడు తప్పకుండా నీ పక్కన ఉంటాను." అని సుజాతతో రాకేశ్ చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే షో కోసమే ఈ వివాహం చేసుకున్నట్లు అర్థమవుతోంది.
వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. రాకింగ్ రాకేశ్ తనదైన శైలి కామెడీతో.. 'జబర్దస్త్'లో టీమ్‌లో గ్రూప్ మెంబర్ నుంచి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఇక సుజాత ఓ టీవీ యాంకర్‌గా సుపరిచితురాలు. ఆ తర్వాత బిగ్‌బాస్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత జబర్దస్త్‌లోనే రాకేశ్‌తో కలిసి స్కిట్లు చేసింది. ఈ క్రమంలోనే వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ విషయాన్ని ఇటీవలే ఓ షోలో తెలిపారు. ఇక సుజాత తాజాగా.. రాకేశ్‌కు లక్ష రూపాయలు విలువ చేసే ఓ స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి అతడిని సర్ప్రైజ్ కూడా చేసింది. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లోనూ షేర్ చేసింది.