తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ రాత్రి లవర్​తో హృతిక్​.. మాజీ భార్య చూస్తుండగానే.. - sussanne khan boyfriend

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ఆయన మాజీ భార్య సుసానే ఖాన్‌ మళ్లీ కలుసుకున్నారు. ఆ సమయంలో హృతిక్​ ప్రియురాలు కూడా పక్కనే ఉంది. ఇంతకీ వారు ఎక్కడ కలుసుకున్నారు? ఆ రాత్రి లవర్​తో హృతిక్​ ఎక్కడికి వెళ్లాడు. అక్కడికి సుసానే ఖాన్​ ఎందుకు వెళ్లింది?

Hrithik Roshan
హృతిక్​

By

Published : Apr 7, 2022, 8:29 PM IST

బాలీవుడ్‌ మాజీ దంపతులు హృతిక్‌ రోషన్‌, సుసానే ఖాన్‌ ఒకే పార్టీలో జంటలుగా సందడి చేసిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. సీనియర్‌ నటి పూజా బేడీ గోవాలో బుధవారం రాత్రి హోస్ట్‌ చేసిన ఈ పార్టీకి హృతిక్‌ రోషన్‌ తన రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సబా అజాద్‌ హజరయ్యాడు. అలాగే సుసానే ఖాన్‌ తన రూమార్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌ అర్స్లాన్ గోనితో పాల్గొంది. దీంతో మరోసారి ఈ మాజీ దంపతులు వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా బేడీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేసింది. దీంతో ఈ పొటోలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

హృతిక్​

మంగళవారం రాత్రి.. ఈ రెండు జంటలు ముంబయి ఎయిర్‌ పోర్టులో.. విడివిడిగా మీడియా కంటపడ్డాయి. ఆ వీడియోల్లో హృతిక్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌.. సబా అజాద్‌ చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ కనిపించాడు. అలాగే సుసానే సైతం తన ప్రియుడు.. గోని చేతిలో చేయి వేసుకుని ఎయిర్‌పోర్ట్‌ లోపలికి వెళుతూ కనిపించింది. ఈ మాజీ దంపతులు.. తమ కొత్త జంటలతో ఒకే పార్టీకి హాజరుకావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

హృతిక్​

కాగా ఈ పార్టీకి వీరితో పాటు ఫరా ఖాన్‌ అలీ, దర్శకుడు అభిషేక్‌ కపూర్‌లతో పాటు తదితర బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే.. కొంతకాలంగా హృతిక్​.. సబా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్​లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఈ జంట ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరు మంచి స్నేహితులే అంటూ హృతిక్‌ సన్నిహిత వర్గాలు చెప్పుకొ‍స్తు‍న్నాయి.

ABOUT THE AUTHOR

...view details