ETV Win New Series : ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వేదికగా పలు సినిమాలు, సిరీస్‌లు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్'లో '#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' అనే వెబ్ సిరీస్ సందడి చేయనుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ సోషల్ మీడియా వేదికగా టీజర్ విడుదల చేశారు. వెబ్‌సిరీస్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పంచుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
A Middle Class Biopic Release Date: ఓ మధ్యతరగతి కుటుంబం కథ నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఆదిత్య హాసన్ వెల్లడించారు. 90వ దశకం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆ వాతావరణాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సీనియర్ నటుడు శివాజి, నటి వాసుకి ఆనంద్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. 2024 జనవరి 5న విడుదలకు సిద్ధం కానుంది.
ETV Win Subscription Price : 40వేల గంటలకుపైగా ఉన్న ఈటీవీ కార్యక్రమాల భాండాగారంలో ఏదైనా.. ఈటీవీ విన్ ఓటీటీ వేదిక ద్వారా కేవలం రోజుకు ఒక్క రూపాయి ఖర్చుతో చూడవచ్చు. సంవత్సరానికి 365 రూపాయలు కనీస మొత్తం చెల్లించి.. ఈటీవీ విన్ మొబైల్ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మొబైల్‌తో పాటు టీవీలోనూ చూడాలనుకుంటే ప్రీమియం ప్లాన్‌లో ఏడాదికి కేవలం 499 రూపాయలు చెల్లిస్తే చాలు.. అనంతమైన వినోదం మీ సొంతం. ఈ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పలు వినోదాత్మక కార్యక్రమాలు, ధారావాహికలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా పలు క్లాసిక్ మూవీలతో పాటు కొత్త కొత్త సినిమాలను కూడా 'ఈటీవీ విన్' అందిస్తోంది. 'ఛాంగురే బంగారురాజా', '#కృష్ణారామా', 'నాగ భూషణం', 'దిల్ సే' వంటి ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రస్తుతం ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇంట్లోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గుడికట్టిన అభిమాని, దైవంగా భావించి పూజలు
ఎనిమిది నెలల ప్రెగ్నెంట్, కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసిన నటి, ఐసీయూలో చిన్నారి