'ఢీ' డ్యాన్స్ షో కొత్త ప్రోమో వచ్చేసింది. ఆద్యంతం అలరిస్తూ ఎపిసోడ్‌పై మరింత అంచనాల్ని పెంచింది తాజా ప్రోమో. ఈనెల 11న ప్రసారం కానున్న షోలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు. అయితే రియల్ హీరోస్ కాదు. అచ్చం వారిలాగే డ్యాన్స్ చేసే.. జూనియర్ చిరు, జూనియర్ పవన్.
'ఢీ' షోలో.. చిరంజీవి, పవన్‌కల్యాణ్ డ్యాన్స్ అదుర్స్! - pawan kalyan dupe
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కలిసి డ్యాన్స్ చేయడం చూసి చాలా కాలమైంది. అలాంటి ఫీల్‌ను అభిమానులకు పంచబోతుంది 'ఢీ' షో.
ఢీ
చిరు, పవన్ కలిసి డ్యాన్స్ చేసి చాలా కాలమైంది. వజ్రోత్సవంలో ఒకసారి.. తర్వాత శంకర్‌దాదా సినిమాలో కలిసి స్టెప్పులేశారు ఈ మెగాబ్రదర్స్. అయితే ఇప్పుడు 'ఢీ' షోలో అలాంటి ఫీలింగ్‌ను కల్పించబోతున్నారు ఈ జూనియర్లు ఇద్దరు. అలాగే ప్రోమోలో 'కళావతి' పాటకు రవి, నవ్యసామి చేసిన డ్యాన్స్ వేరే లెవల్లో ఉందనే చెప్పాలి.
ఇదీ చదవండి:'దీపికా పిల్లి' ఇంత స్పీడా.. అనసూయ కూడా ఆమె తర్వాతేగా!
Last Updated : May 6, 2022, 10:51 PM IST